Sunday, April 28, 2024
- Advertisement -

సీబీఐకి వైఎస్ జ‌గ‌న్ గ్రీన్‌సిగ్నల్….జీవో జారీ…టీడీపీ నేత‌ల్లో వ‌నుకు

- Advertisement -

ఏపీలో సీబీఐని నిషేదిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి రద్దు చేశారు. ఏపీ భూభాగంలో సీబీఐ తనిఖీలు, దర్యాప్తు చేసేందుకు అనుమతి పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై విచారణ చేయాలని ఇప్పటికే వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలో సీబీఐకి సాధారణ సమ్మతిని పునరుద్ధరించడం హాట్‌టాపిక్‌గా మారింది.

ఈ మేరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఏపీలో పలు కేసులను సీబీఐ విచారించేందుకు మార్గం సుగమమయింది. 2018, నవంబర్ 8న సీబీఐకి ఇచ్చిన సమ్మతి ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఐటీ, సీబీఐ దాడులతో టీడీపీ నేతనలను ఇబ్బందులు పెడుతున్నారని గతంలో కేంద్రంపై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. సోదాల పేరుతో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు ఏపీలోకి అడుగుపెట్టకుండా నిషేధం విధించారు.ఏపీ హోంశాఖ జారీచేసిన ఈ నోటిఫికేషన్‌‌తో రాష్ట్ర భూభాగం పరిధిలో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే సీబీఐ తనిఖీలు, దర్యాప్తు చేయవచ్చు. ఇది టీడీపీనేత‌ల గుండెల్లో రైల్లు ప‌రిగెడుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -