Thursday, May 2, 2024
- Advertisement -

ప్రభుత్వ కార్యాలయాల్లో హత్యలు.. పెట్టుబడులు వస్తాయా?!

- Advertisement -

ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది? ఒకవైపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ దేశాలు చుట్టి వచ్చి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాడు.

మీ పెట్టుబడులకు ఏపీ ఒక ఉత్తమమైన వేదిక.. మీరు వ్యాపారాలు చేసుకోవడానికి మా రాష్ట్రం చాలా బాగుంటుంది.. అన్నిరకాల సౌకర్యాలు, మంచి వాతావరణం ఉంది అంటూ వివిధ దేశాలకు పోయి బాబు ఊదరగొడుతున్నాడు.

మరి ఆయన అక్కడ అలా చెబుతుంటే.. ఏపీలో మాత్రం యధేచ్చగా హత్యలు జరిగిపోతున్నాయి! వీటిని ఫ్యాక్షన్ హత్యలు.. ప్రతీకార హత్యలు అని కొట్టిపడేయవచ్చుకానీ… ఈ హత్యలు ప్రభుత్వ కార్యాలయాల్లోనే జరగడం అత్యంత విషాదకరమైన అంశం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా కార్యకర్తలపై దాడులు జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ విషయం లో వైకాపా వాళ్లు గోల గోల చేశారు. 

అదలా సద్దుమణిగింది అనుకొంటే.. అనంతపురం జిల్లాలో కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు హత్యలు జరిగాయి. ఒకటి సొసైటీ ఆఫీసులో కాగా.. రెండోది ఏకంగా రెవెన్యూ ఆఫీస్ లోనే జరిగింది. రెండో హత్య అయితే మరీ దారుణం.. ఆ ఎమ్ ఆర్ వో ఆఫీసు పక్కనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. హత్యాస్థలంతో ఒక పోలీసాఫీసర్ నేమ్ ప్లేటు కూడా పడిపోయింది. దీన్ని బట్టి ఆ పోలీసు కూడా హత్యాకాండలో పాలుపంచుకొన్నాడేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి! 

ఈ సమయంలో గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే.. తమకు అధికారం ఇస్తే శాంతిభద్రతలను కాపాడతామని బాబు అనేక సార్లు ప్రకటించుకొనే వాళ్లు. తీరా అధికారం చేతికి అందాకా మాత్రం ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. అటు బాబు ఇమేజ్ పరంగా చూసుకొన్నా.. ఏపీకి రావాల్సిన పెట్టుబడులను బట్టి చూసుకొన్నా ఈ హత్యాకాండలు అయితే మంచిది కాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -