Friday, May 3, 2024
- Advertisement -

వాజ్ పేయికే గుడ్ బై చెప్పారు బాబుకు … మోదీ ఎంత?

- Advertisement -

వైసీపీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి చంద్ర‌బాబుపై నిప్పులు చెర‌గారు. బీజేపీ, టీడీపీలు నాలుగు సంవ‌త్స‌రాలు కాపురంచేసి ఇప్పుడు విడాకులు తీసుకున్నార‌న్నారు. ప్రధాని మోదీ గ్రాఫ్ తగ్గుతోందన్న ఆలోచనతో ఇప్పుడు ఎన్డీయే నుంచి ఆయన బయటకు వచ్చారని తెలిపారు. వాజ్ పేయి ఉన్నప్పుడే బీజేపీతో తెగతెంపులు చేసుకున్న చంద్రబాబుకు… మోదీకు దూరంగా జరగడం పెద్ద విషయమేమీ కాదని అన్నారు.

వేళ మోదీ గ్రాఫ్ పెరుగుతుందని అనిపిస్తే… మళ్లీ ఆయనతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేందుకు కూడా చంద్రబాబు సిద్ధపడతారని… ఇవన్నీ ఆయనకు అలవాటేనని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సీట్లు పెరుగాయనే భావనతో వైసీపీకి చెందిని ఎంతో మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కున్నారని విమర్శించారు.

చంద్రబాబులో గొప్ప మేధావితనం ఉందని… దాన్ని ఎవరూ కాదనలేమని మేకపాటి చెప్పారు. ఇప్పుడు 30వ సారి చంద్రబాబు ఢిల్లీకి వచ్చారని… పార్లమెంటు సెంట్రల్ హాల్ లో పలువురు నేతలతో ఆయన భేటీ అయ్యారని… దాన్ని తాము కూడా చూశామని… అయినా ఎలాంటి ఫలితం రాలేదని అన్నారు. చంద్రబాబు ఎలాంటి నాయకుడో దేశంలో ఉన్న రాజకీయ నేతలందరికీ తెలుసని చెప్పారు. బీజేపీతో జగన్ కుమ్మక్కయ్యారని చంద్రబాబు ఆరోపించడం దారుణమని… ‘చంద్రబాబు గారూ ఇది మీకు తగునా’ అని ప్రశ్నించారు. ఆయన ఢిల్లీ పర్యటన రాజకీయ పర్యటనే తప్ప, రాష్ట్ర ప్రయోజల కోసం చేస్తున్నది కాదని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -