Monday, May 6, 2024
- Advertisement -

బ‌డ్జెట్‌లో ఏపీకీ కేంద్రం మొండిచేయి చూపింది…..

- Advertisement -

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాల పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ పెట్టారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఒక మహిళా ఆర్థిక మంత్రి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది ప్రప్రథమం. అయితే ఈ బ‌డ్జెట్‌లో ఏపీకీ మొండిచేయి చూపారు. అస‌లే ఏపీ ఆర్థిక లోటు బ‌డ్జెట్‌తో ఉండంతో త‌గిన విధంగా కేంద్ర బడ్జెట్‌లో కేటాయంపులుంటామ‌ని భావించిన రాష్ట్రానికి బ‌డ్జెట్ షాక్ ఇచ్చింది. ఈ బ‌డ్జెట్ వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు.

ఈ బ‌డ్జెట్ వ‌ల్ల రాష్ట్రానికి ఒరిగిందేమి లేద‌ని విమ‌ర్శ‌లు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచేయి చూపిందని విమర్శించారు. ఈ బడ్జెట్ లో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదని, ఏపీకి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారనే దానిపై స్పష్టత లేదని, విభజన చట్టంలోని అంశాలపై ఏం మాట్లాడలేదని, విశాఖ, విజయవాడ మెట్రో నిధుల విషయంలో అన్యాయం జరిగిందని విమర్శించారు.

.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని, పోలవరం, అమరావతి నిర్మాణంపై నిధుల ప్రస్తావనే లేదని అన్నారు. జీరో బడ్టెట్ వ్యవసాయంపై స్పష్టత లేదని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఏ పోరాటానికైనా తాము సిద్ధమని విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌క‌టించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -