Thursday, May 2, 2024
- Advertisement -

మంగ‌ళ‌గిరి బ‌రిలో ట‌ఫ్ పైట్ త‌ప్ప‌దా..?

- Advertisement -

ఐటీ మంత్రి లోకేష్ పోటీ చేయ‌డం ఖ‌రార‌య్యింది. ఇన్నాల్లు ఎక్క‌డ‌నుంచి పోటీ చేస్తార‌నే వార్త‌ల‌కు ఎట్ట‌కేల‌కు చెక్ పెట్టారు చంద్ర‌బాబు. ఎమ్మెల్సీద్వారా మంత్రి ప‌ద‌విలో కొన‌సాగుతున్నారు. దొడ్డి దారిన మంత్రి అయ్యాడ‌నే ప్ర‌త‌ప‌క్ష పార్టీల‌ విమ‌ర్శ‌లు లోకేష్‌ను వెంటాడుతూనె ఉన్నాయి. వాట‌న్నింటికి చెక్ పెట్టేందుకు లోకేష్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారు. ఈ సారి ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు.

గ‌త కొద్దిరోజులుగా భీమిలి, కుప్పం, కృష్ణా జిల్లా పెనమలూరునుంచి పోటీ చేస్తార‌నే వార్త‌లు వ‌చ్చిన‌సంగ‌తి తెలిసిందే. చివ‌ర‌కు మంగ‌ళ‌గిరి సీటును లోకేష్‌కు క‌న్ఫ‌మ్ చేసింది టీడీపీ అధిస్టానం. చిన‌బాబును అమ‌రావ‌తి ప్రాంతంనుచి పోటీ చేస్తే దాని ప్ర‌భావం టీడీపీ గెల‌పుపై ప‌డుతుంద‌ని తెలుగు త‌మ్ముళ్ల వాద‌న‌.

మంగ‌ళ‌గిరి బ‌రిలో దిగుతున్న లోకేష్‌కు గెలుపు అంత ఈజీ కాదు.ఇక్క‌డ‌నుంచి వైసీపీ త‌రుపున ఆర్కే పోటీలో ఉంటాడ‌న‌డంలో సందేహంలేదు. ఇద్ద‌రి మ‌ధ్య పోటీ ట‌ఫ్ ఫైట్ ఉటుంద‌న‌డంలో సందేహంలేదు. మంగళగిరి నుంచి 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున ఆళ్ల రామకృష్ణా రెడ్డి గెలుపొందారు. ఆయనకు 88,977 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవికి 88965 ఓట్లొచ్చాయి. కేవలం 12 ఓట్ల తేడాతో ఆయన ప్రత్యర్థిపై గెలుపొందారు.

2014 ఎన్నిక‌ల్లో త‌క్కువ ఓట్ల మెజారిటీతో గెలిచిన ఆర్కే ఈ సారి ట‌ఫ్ పైట్ ఉండ‌నుంది. అందులోనే పోటీలో నిలిచేది లోకేష్ కాబ‌ట్టి బాబు త‌న శ‌క్తియుక్తులు ఉప‌యోగిస్తారు. అందుకే ఆర్కే ప్ర‌జ‌లను త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాడు. పేదల కడుపు నింపడం కోసం రూ.4కే భోజనం అందించడం, రూ.10కే సంచి నిండా కూరగాయలు అందించడం తదితర కార్యక్రమాలను ఆయన చేపడుతున్నారు.

జగన్‌కు నమ్మిన బంటులా ఉన్న ఆయన బాబుకు నిద్ర‌లేకుండా చేస్తున్నారు. బాబు, టీడీపీ ప్ర‌భుత్వంపై పలు పిటిషన్లు దాఖలు చేశారు. అమరావతిలో నిబంధనలు పాటించడం లేదంటూ పలు పిటిషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్‌లో డీజీపీ ఠాకూర్ స్థల ఆక్రమణ, ఓటుకు నోటు కేసు, సాధికార మిత్ర, సదావర్తి భూములు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, సివిల్ సర్వెంట్లకు భూముల కేటాయింపు, జగన్ పై కోడి కత్తి కేసు దర్యాప్తు.. ఇలా పలు పిటిషన్లు దాఖలు చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అడుగడుగునా ప్రభుత్వానికి ఆటంకాలు కల్పించాకరు. మంగళగిరి నుంచి ఆళ్ల పోటీలో ఉంటే మాత్రం లోకేష్‌కు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. బాబు ఛాణిక్య రాజ‌కీయాన్ని ఆర్కే ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -