Friday, April 26, 2024
- Advertisement -

పాఠశాలల్లో కొత్త పథకానికి శ్రీకారం.. తొందరగా అందుకోండి..!

- Advertisement -

కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామని… ఇందుకోసం ఏడాదికి రూ.2000 కోట్లతో బృహత్తర విద్యా పథకం అమలు చేయనున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. హైదరాబాద్ లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ఉపసంఘ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను అధికారులు సమావేశంలో వివరించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్య ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంగ్ల మాధ్యమంలో గురుకులాలను ఏర్పాటు చేశారన్న సబ్ కమిటీ… నాణ్యమైన విద్య అందినప్పుడే మానవవనరుల అభివృద్ధి చెందుతాయన్న సీఎం ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో విద్యారంగంలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది.

మావోయిస్టుల చెర నుంచి రాకేశ్వర్ ‌సింగ్‌ విడుదల!

ఏజెన్సీ లోనే ముందు.. అధిక శాతం ఓటింగ్ లో పాల్గొన్న గిరిజనులు!

79 వేల మంది చిన్నారులకు కరోనా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -