మావోయిస్టుల చెర నుంచి రాకేశ్వర్ ‌సింగ్‌ విడుదల!

- Advertisement -

మొన్నామద్య జాపూర్‌-సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని టెర్రం అడవుల్లో గడిచిన శనివారం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ భీకర పోరులో 22 మంది జవాన్లు అమరులయ్యారని అంటున్నారు. అయితే జవాన్లు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్న సమయంలో జవాను రాకేశ్వర్‌సింగ్‌ మావోయిస్టులకు బందీగా చిక్కాడు. ఐదు రోజులుగా మావోయిస్టుల చెరలోనే ఉన్నాడు. 

అయితే మావోయిస్టులతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపించి జవాన్ని విడుదల చేస్తారని ఇప్పటి వరకు అనుకున్నారు. ఇదే సమయంలో రాకేశ్వర్ సింగ్ సతీమణి తన భర్తను విడిచిపెట్టాలని మావోయిస్టులను వేడుకుంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో రాకేశ్వర్‌సింగ్‌ మావోయిస్టులు విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. స్థానిక మీడియా సమక్షంలో గ్రామస్థుల ద్వారా రాకేశ్వర్‌సింగ్‌ను విడుదల చేసినట్లుగా, ప్రస్తుతం అతను టర్రెం పోలీసుల సంరక్షణలో ఉన్నట్లుగా సమాచారం. 

ఏజెన్సీ లోనే ముందు.. అధిక శాతం ఓటింగ్ లో పాల్గొన్న గిరిజనులు!

79 వేల మంది చిన్నారులకు కరోనా

పాతబస్తీకి వెళ్లి చూడండి పూర్తిగా కనిపిస్తారు.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు..!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -