Thursday, May 2, 2024
- Advertisement -

టీడీపీకి చుక్క‌లు చూపిస్తున్న నంద్యాల ప్ర‌జ‌లు…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక‌లో బాబు అమ‌లు చేస్తున్న వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి.ఎలాగైనా గెల‌వాల‌ని మంత్రులంద‌రిని అక్క‌డే మాకాం వేసి ప్ర‌చారం చేయాల‌ని సూచించారు.అయితె టీడీపీ మంత్రుల కాకుండా పిరాయింపు ద్వారా మంత్రి ప‌ద‌వులు పొందిన వారినుంచి ఇబ్బందులు త‌ప్పేట‌ట్టు లేవు.

అక్కడ ఫలితం తేడా వస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న ఉద్దేశంతో నిత్యం సగం కేబినెట్‌ నంద్యాల వీధుల్లో తిరిగేలా చూస్తున్నారు సీఎం. ఎప్పటికప్పుడు పార్టీ నేతల నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఆయా సామాజికవర్గాలను ఆకర్షించే బాధ్యతను ఆయా సామాజికవర్గాల మంత్రులకు అప్పగించారు. ఇందులో భాగంగా ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డిలనూ నంద్యాలలో దింపారు చంద్ర‌బాబు.

అయితే ఇక్కడే పెద్ద చిక్కువచ్చి పడింది. పార్టీ నేతలతో పాటు వివిధ వర్గాల నుంచి అందుతున్న నివేదికలు… ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డిలను వెంటనే నంద్యాల నుంచి వెనక్కు రప్పించాలని సూచించినట్టు సమాచారం. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి పదవులు చేపట్టిన ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డిలు నంద్యాల నియోజవర్గంలో ప్రచారం చేస్తే పడే ఓట్లు కూడా పడకుండా పోతాయని సీఎంకు నివేదించారు

పార్టీ ఫిరాయించి నైతికతను కోల్పోయిన వ్యక్తులు కూడా ఎవరికి ఓటేయాలో తమకు సూచించడం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నట్టు టీడీపీ నేతలు గుర్తించారు. పైగా ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డిలు నీతి తప్పి పార్టీ ఫిరాయించడంతో వారి సొంత సామాజికవర్గం వారే ఎక్కువ ఆగ్రహంగా ఉన్నారని తేలింది.

రెడ్డి సామాజికవర్గం ఓటర్లను ఆకర్షించేందుకు ఈ ఇద్దరు మంత్రులు ఏమాత్రం ఉపయోగపడకపోగా… పార్టీ నైతిక విలువలపై ప్రజల్లో చర్చ జరిగేందుకు వీరి ప్రచారం దోహదం చేస్తోందని చంద్రబాబుకు రిపోర్టులు అందాయని చెబుతున్నారు. భూమా అఖిలప్రియ కూడా పార్టీ ఫిరాయించినప్పటికీ…. ఇప్పుడు ఆమె సోదరుడే బరిలో ఉన్నందున లాభమైనా, నష్టమైనా ఆమెను ప్రచారంలో కొనసాగించక తప్పదని… కానీ ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డిలనుప్ర‌చారానికి దూరంగా ఉంచాల‌ని నివేదిక‌లు వ‌చ్చాయంట‌.మ‌రి చంద్ర‌బాబు ఎలాంటి నిర్న‌యం తీసుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -