Monday, April 29, 2024
- Advertisement -

పోలవరం పూర్తి కావాలంటే.. పవన్ నాలుగో పెళ్లి చేసుకోవాలా ?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోలవరం ప్రాజెక్ట్ ఎంతో ముఖ్యమో అందరికీ తెలిసిందే. వృధాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి నదిజలాలను సద్వినియోగం చేసుకునేందుకు కొన్నేళ్లుగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వాలు మారుతున్నప్పటికి ప్రాజెక్ట్ మాత్రం పూర్తి కావడం లేదు. ప్రభుత్వంలోకి రాక ముందు పోలవరం పూర్తి చేస్తామని జబ్బలు చరుచుకునే విధంగా వ్యాఖ్యలు చేస్తూ.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత చేతులెత్తేస్తున్నారు రాజకీయ నాయకులు. చంద్రబాబు హయాంలో పోలవరం పనులు కొంతవరకు పూర్తయిన వార్తలు అడపా దడపా వినిపించేవి. .

కానీ వైఎస్ జగన్ అధికరంలోకి వచ్చిన తరువాత పోలవరం నిర్మాణ పనులకు సంబంధించిన వార్తలు అసలు కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని గత ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కుండ బద్దలు కొన్నినట్లు అసెంబ్లీలో చెప్పుకొచ్చారు గతంలో. కానీ ఆ తరువాత పోలవరం గురించి మాట్లాడడమే మర్చిపోయారు. ఇక ప్రస్తుత ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు కూడా ఇదే వైఖరి ప్రదర్శిస్తున్నారు. ” పోలవరం ఎంతవరకు వచ్చింది.. ఎప్పుడు పూర్తి అవుతుందో ఒక అరగంట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలవా ?.. అంబటి ” అంటూ జనసేన పార్టీ ప్రశ్నించింది. దీనిపై స్పందించిన అంబటి రాంబాబు.. ” పవన్ నాల్గవ పెళ్లి లోపు పూర్తి చేసే భాద్యత నాది ” అంటూ వ్యంగ్యంగా ట్విట్టర్ లో రాసుకొచ్చారు అంబటి రాంబాబు.

అయితే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్స్. అంటే పోలవరం ఎప్పటికీ పూర్తికాదని పరోక్షంగా అంబటి హింట్ ఇచ్చారని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇచ్చిన హామీలపై మాట తప్పిన నాయకులను ఏం చేయాలన్నిది గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలకు సంభంధించిన వీడియో ను షేర్ చేస్తూ.. అంబటి పై ఘాటుగా రెచ్చిపోతునారు నెటిజన్స్. ఏది ఏమైనప్పటికి అంబటి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి సంబంధించి జగన్ సర్కార్ వద్ద ఎలాంటి కమిట్మెంట్ లేదనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -