Thursday, May 2, 2024
- Advertisement -

యామిని వర్సెస్ శ్రావణి

- Advertisement -

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రె్డ్డి ఆశీస్సులతో శింగనమల టీడీపీ టికెట్ అయితే దక్కించుకున్న బండారు శ్రావణి గెలుపు మాత్రం అంత ఈజీ కాదని స్పష్టమవుతోంది. ఎందుకంటే..? సిట్టింగ్ ఎమ్మెల్యే యామినీబాలకు దాదాపు ఖరారైపోయిన టికెట్ బండారు శ్రావణి ఆఖరి నిముషంలో తన్నుకుపోయింది. దీంతో యామినిబాల ఆమె సోదరుడు అశోక్, తల్లి టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ శమంతకమణి నుంచి శ్రావణికి అసమ్మతి సెగ గట్టిగానే తగులుతోంది. ఎస్సీ రిజర్వుడు స్థానం అయిన శింగనమలలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే యామినిబాలపై నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఉండటంతోనే మొదటి విడత జాబితాలో ఆ స్థానాన్ని చంద్రబాబు పెండింగ్ లో పెట్టారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శమంతకమణి కుమార్తె అయిన యామినిబాలకు తోడు ఆమె సోదరుడు అశోక్ నియోజకవర్గంలోని అన్ని వ్యవరహారాల్లో వేలు పెడుతున్నారని, వీళ్ల వల్ల విసిగిపోయామన్ అవినీతి ఆరోపణలపై స్థానికులతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేతల నుంచి కూడా చంద్రబాబుకు నివేదికలు అందాయి. ఇదే సమయంలో వాళ్ల ఇంటిపోరు కూడా రచ్చకెక్కింది. గత ఎన్నికల్లో తన కుమార్తె యామినిబాలకు టికెట్ ఇచ్చిన చంద్రబాబు ఈసారి తన కుమారుడు అశోక్ కు టికెట్ ఇవ్వాలని శమంతకమణి కోరారు. లేదు తనకే ఈ సారి కూడా ఇవ్వాలని యామినీబాల పట్టుబట్టారు. ఇలా ఇటు ఇంటిపోరుకు తోడు బయట నుంచి అమ్మతి కూడా తోడయింది.

ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఆ కుటుంబానికే టికెట్ ఇస్తే తన కుమారుడు జేసీ పవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్న అనంతపురం పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ప్రభావం పడుతుందని జేసీ భయపడ్డారు. శింగనమల నియోజకవర్గంలో ఈ సారి యామినీబాలకు మళ్లీ టికెట్ ఇస్తే అక్కడ ఎటూ టీడీపీ ఓడిపోతుందని, ఆ ప్రభావం అనంతపురం ఎంపీ సీటుపైనా పడుతుందని జేసీ బాహాటంగానే చెప్పేశారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో బండారు శ్రావణి తాత నారాయణస్వామికి టికెట్ ఇచ్చారు. కానీ ఆయన స్నేహితుడికి త్యాగం చేసి నాడు పోటీ చేయలేదు. ఇంకోసారి ఆఖరి నిముషంలో శమంతకమణికి నాడు టీడీపీ టికెట్ ఇచ్చాం. తర్వాత గత ఎన్నికల్లో శ్రావణి తండ్రి బండారు రవికుమార్ కు టికెట్ ఇచ్చినా బ్యాంక్ ఉద్యోగి అయిన ఆయన వీఆర్ఎస్ ఇబ్బందులతో పోటీ చేయలేకపోయారు. దశాబ్దాలుగా టీడీపీ సానుభూతిపరులైన బండారు కుటుంబానికే ఈ సారి టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యత తనదేనని జేసీ చెప్పడంతో బాబు ఈ సారి శింగనమల టికెట్ బండారు శ్రావణికే కేటాయించారు.

దీంతో ఇప్పుడు అక్కడ వైసీపీ అభ్యర్ధి జొన్నలగడ్డ పద్మావతితో శ్రావణి ఫైట్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో దాదాపు 4వేల ఓట్ల తేడాతో యామినీబాల చేతిలో ఓటమి చెందిన పద్మావతి ఇప్పుడు రెండోసారి పోటీ పడుతున్నారు. ఆమె మీద సానుభూతి ఉందని లోకల్ టాక్. మరో వైపు శ్రావణికి సొంతపార్టీ నేతలైన యామినీబాల, ఆమె సోదరుడు అశోక్, శమంతకమణి మోకాలడ్డుతున్నారు. సహాయనిరాకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శింగనమలలో ఈ సారి టీడీపీ జెండా ఎగురుతుందో లేదో చూడాల్సిందే ? ఈ నియోజకవర్గానికి ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్ధి గెలిస్తే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనేది ఆ నియోజకవర్గం ఏర్పాటు అయినప్పటి నుంచీ వస్తున్న సెంటిమెంట్. ఇంతవరకూ 11 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా 4సార్లు కాంగ్రెస్, 5సార్లు టీడీపీ, ఒకసారి ఇండిపెండెంట్ మరోసారి జనతాపార్టీ అభ్యర్ధి ఇక్కడ గెలిచారు. ఈ సారి ఎవరు గెలుస్తారు ? సెంటిమెంట్ కొనసాగుతుందో లేదో అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -