Tuesday, April 30, 2024
- Advertisement -

బాబూనా…మజాకా….?

- Advertisement -

ఏపీసీఎం చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం రాష్ట్ర రాజ‌కీయాల‌ను షేక్ చేస్తోంది. అదే ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది.సీబీఐ రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే ఇక నుంచి ప్ర‌భుత్వం అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి చేస్తూ జీవోను జారీ చేయ‌డం ఇప్పుడు వ‌వాదాస్ప‌దంగా మారింది. గ‌తంలో సీబీఐపై అపార గైర‌వం ఉన్న బాబు ఇప్పుడు అదే సీబీఐ చేదుగా మారింది.

ఎన్డీఏ నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత అధికార‌పార్టీ న‌తేలే ల‌క్ష్యంగా సీబీఐ దాడులు చేస్తోంది. దీన్ని అడ్డుకొనేందుకే బాబు ఈ జీవో తెచ్చార‌ని న్యాయ‌నిపుణులు అంటున్నారు. అయితే బాబు తీసుకున్న నిర్ణ‌యం వెనుక అసలు బాగోతాలు బ‌య‌ట ప‌డుతున్నాయి.

సీబీఐ మీద అవినీతి మ‌ర‌క వేసి.. పూర్తిగా త‌న గుప్పిట్లో ఉంచుకుంది కేంద్ర ప్ర‌భుత్వం. అయినా కాంగ్రెస్ ప్ర‌భుత్వం నుంచే సీబీఐపై పెత్త‌నం జ‌రుగుతూ వ‌స్తోంది. ఈ విష‌యంపై సాక్షాత్తూ సుప్రీం కోర్టే అస‌హ‌నం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌ల వైఎస్సార్ సీపీ అధినేత, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఎంతో ప‌కడ్బందీ సెక్యూరిటీ ఉన్న ఎయిర్ పోర్టులోనే జ‌గ‌న్‌పై దాడి జ‌ర‌గ‌డంతో ఎన్నో అనుమానాలు రెకేత్తాయి. ఈ కేసు హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. సీబీఐ విచార‌ణ‌కు హైకోర్టు ఆదేశించే విధంగా ప‌రిస్థితులు ఉన్నాయి. అదే జ‌రిగితే అస‌లు దోషులు బ‌య‌ట‌కు వ‌స్తార‌ని బాబుకు వ‌ణుకు మొద‌ల‌య్యింది.

మ‌రో వ‌పైపు పోల‌వ‌రం, ఇసుక‌, భూకుంభ‌కోణాల‌పై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌తో విచార‌ణ జ‌రిపించాల‌ని ఇప్ప‌టికే భాజాపా నేత‌లు కేంద్రానికి, హోంశాఖ‌కు విన్న వించిన సంగ‌తి తెలిసిందే. ఒక‌వేళ హైకోర్టు సీబీఐ విచార‌ణ‌కు ఆదేశిస్తే.. అందుకు అవ‌కాశం లేకుండా చేయాల‌నేది అస‌ల ఎత్తుగ‌డ అంటున్నారు. అందుకే సీబీఐను.. పైకి ఛీబీఐ అంటూ.. లోప‌ల జ‌గ‌న్ కేసును విచార‌ణ‌ లేకుండా చేసేందుకు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంచ‌నా వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -