Monday, April 29, 2024
- Advertisement -

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

- Advertisement -

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఉప సంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డిసెంబర్ 17, 2019న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నట్లు అసెంబ్లీ ముగింపు రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అమరావతిని అసెంబ్లీ క్యాపిటల్‎గా, న్యాయస్థానం రాజధానిగా రాయల సీమను, ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. మూడు రాజధానుల వల్ల మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. సీఎం ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ప్రకంపనలే చెలరేగాయి. ఈ బిల్లు శానస సభలో ఆమోదం పొందినప్పటికీ.. మండలిలో మాత్రం ఆమోదం పొందలేకపోయింది. దీంతో బిల్లు వీగిపోయింది. ఒకానొక సమయంలో వైఎస్ జగన్ శాసన మండలిని రద్దు చేయాలని సుప్రింకోర్టుకు కూడా వెళ్లారు.

రాజధాని కోసం తమ పొలాలను విరాళంగా ఇచ్చిన అమరావతి, మంగళగిరి, తుళ్లూరు, ఉంగుటూరు, జూపూడి, అత్తలూరు, కర్లపూడి, దిడుగు, ధరణికోట, నరుకుళ్ళపాడు, నెమలికల్లు, పెద మద్దూరు, పొందుగల, మల్లాది, మునుగోడు, యండ్రాయి, లింగాపురం, వైకుంఠపురం గ్రామాల్లో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగాయి. టీడీపీ శ్రేణులు, అమరావతి రైతులు నిరసక కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర సచివాలయాలకు వస్తున్న మంత్రులను, ప్రభుత్వ ఉద్యోగులను మంగళగిరి, తుళ్లూరు రైతులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీలు సైతం జులిపించారు. అమరావతి ప్రజల నుంచి తప్పించుకోవడానికి ప్రజా ప్రతినిధులు తమ వాహనాలకు రైతులు అడ్డురాకుండా భారీ గెట్లు ఏర్పాటు చేసుకోని, భారీ బందోబస్తుతో వెళ్లి వచ్చేవారు.

దాదాపు సంవత్సరం పాటు రైతులు వివిద రూపాల్లో నిరసన తెలిజేశారు. తమకు ఆస్తులు లేకుండా ప్రభుత్వం నుంచి తాము ఏమీ ఆశించకుండా 30 వేల ఎకరాలను ఇచ్చామని ఇప్పుడు జగన్ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగడంలేవని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. మరో వైపు విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని పేరుతో భారీ స్కాం చేయాలని చూస్తుందని ఏపీ టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. అమరావతి రైతులకు మద్దతుగా టీడీపీ నేతలు సైతం ధర్నాలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.

రైతుల నిరసనకు ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులు పాదయాత్రకు సిద్దమయ్యారు. రైతుల పాదయాత్ర ప్రారంభించి 20 రోజులు దాటింది రైతు సంఘాల పాయాత్రలో చేపట్టగా కొన్ని ప్రాంతాల్లో అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. వారిపై లాఠీలు జులిపించారు. వారం క్రితం పాదయాత్ర నెల్లూరు జిల్లాకు చేరుకుంది. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే పాదయాత్రలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. దీంతో రైతుల పాదయాత్రలో ఇతరులు ప్రవేశించారని పోలీసులు రైతులపై మరోసారి దాడికి దిగిరు. పోలీసుల లాఠీ చార్జిలో పలువురుకి గాయాలయ్యాయి.

మరోవైపు రైతు సంఘాల పాదయాత్రకు మద్దతుగా బీజేపీ సైతం మద్దతు తెలిపింది. రెండు సంవత్సరాలుగా రైతులు అలుపెరగకుండా రాజధానికోసం ధర్నాలు చేయడం అభినందనీయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఏపీ బీజేపీ నేతలు రైతులకు మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. అమిత్ షా పిలుపుతో రాష్ట్ర బీజేపీ నేతలు రైతు సంఘాల పాదయాత్రలో పాల్గొన్నారు.

టీడీపీతో పాటు బీజేపీ రైతులకు మద్దతు తెలపడంతో వైసీపీపై ఒత్తిడి పెరిగింది. ప్రజల మద్దతు కరువు అవుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రజా సంఘ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. తమ ఆందోళనకు ప్రభుత్వం దిగొచ్చినట్లైందని సంతోషం వ్యక్తం చేశారు. ఇద్ది ముమ్మాటికి వైసీపీ ప్రభుత్వంపై తాము సాధించిన విజయమని అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విజయం మాజీ సీఎం చంద్రబాబు నాయుడిదని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కొత్త రాష్ట్రంలో కొత్త రాజధానిని నిర్మించుకోవడం కోసం రైతులనుంచి భూమిని సేకరించడం, సీఎం మాటను నమ్మి అమరావతి మండల పరిధిలోని గ్రామాల ప్రజలు ఏమీ ఆశించకుండా భూములు ఇవ్వడం చకచకా జరిగిపోయింది. క్యాపిటెల్‎పేరు అమరావతిగా నిర్ణయించారు. దీనికి అసెంబ్లీలో వైసీపీ సైతం మద్దతు ఇచ్చిందని పలువురు రాజకీయ విశ్లేషకులు తెలిపారు.

రెండు సంవత్సరాలకుపైగా వివిధ రూపంలో నిరసనలు చేసి లాఠీ దెబ్బలు తిన్న రైతన్నలు.. పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురైనా వెనుదిరగని రాజధాని రైతులు.. లాఠీ దెబ్బలు తింటూనే యాత్ర కొనసాగించడం, అన్ని పార్టీలు అన్నదాతల ర్యాలీకి మద్దతు తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది.

పోలవరం నిర్వాసితుల ప్యాకేజీలో అక్రమాల పాపం ఎవ్వరిది..?

అమరావతి రైతులపై లాఠీ ఛార్జ్ వెనుక ఉన్నదెవరు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -