Sunday, April 28, 2024
- Advertisement -

ఆ ధైర్యం మా తల్లిదండ్రుల నుంచి వచ్చిందే

- Advertisement -

ఆళ్ళగడ్డ, నంద్యాల ప్రజలు వెంట ఉన్నంత కాలం అమ్మ, నాన్నల ఆశయాలను నెరవేర్చేందుకు కృషిచేస్తామని భూమా సిస్టర్స్ చెప్పారు.ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకున్నా నా కుటుంబం నుండి రాజకీయాల్లో ఉన్న వారికి అండదండగా నిలుస్తానని భూమా మౌనిక చెప్పారు. ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట్వూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

అక్క అఖిలప్రియకు బ్రెయిన్ ఎక్కువ. నాకు వాయిసెక్కువ అని భూమా మౌనిక చెప్పారు. అమ్మ, నాన్నలు చూపిన దారిలోనే నడుస్తున్నట్టు చెప్పారు. ఆళ్ళగడ్డ, నంద్యాల ప్రజలు అండగా ఉన్నంత కాలం వారికి సేవ చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామన్నారు మౌనిక. పదవిలో ఉన్నా, లేకున్నా ప్రజలకు సేవ చేయడాన్ని చిన్నప్పటి నుండి నేర్చుకొన్నట్టు మౌనిక చెప్పారు.

నాన్న చనిపోయిన తర్వాత రాజకీయాల్లో రావాలని ఉన్నా ..ఈ విషయమై కుటుంబంలో చర్చించిన తర్వాత బ్రహ్మనందరెడ్డిని నంద్యాల నుండి బరిలోకి దింపాలని నిర్ణయించుకొన్నట్టు మౌనిక చెప్పారు. అమ్మ బతికున్న కాలంలో అమ్మ ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకున్నా అన్న, అక్కకు రాజకీయాల్లో సపోర్ట్‌ా ఉంటానని మౌనిక చెప్పారు.అక్కపై ప్రత్యర్థి పార్టీల నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం సరైందికాదన్నారు.

ధైర్యంగా మాట్లాడే లక్షణం తమ తల్లిదండ్రుల నుంచి తమకు వచ్చిందని భూమా మౌనిక అన్నారు. ప్రజలతో కలిసి ఉండటమనేది తమకు చిన్నప్పటి నుంచి అలవాటేనని, ప్రజల కోసం తాము పనిచేస్తూనే ఉంటామని చెప్పారు. పదవులు ఉంటేనే పనిచేస్తామని ఆలోచనా ధోరణి తమకు లేదని, ప్రజలకు సేవ చేయడమనేది తమ లక్ష్యమని మౌనిక అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -