Thursday, May 2, 2024
- Advertisement -

ఫిరాయింపు నేత‌లకు చంద్రబాబు చెక్‌

- Advertisement -

రెంటికీ చెడిన‌ రేవ‌డి.. అనే సామెత ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల‌కు బాగా తెలిసివ‌స్తోంది. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్‌సీపీ నుంచి క‌ర్నూలు ఎంపీగా గెలుపొందిన బుట్టారేణుక రాజ‌కీయ ప్ర‌స్థానం ఇప్పుడు ప్ర‌శ్నార్థకంగా మారింది. టీడీపీలోకి కోట్ల ఎంట్రీతో సీన్ మారిపోయింది. దీంతో నా సంగ‌తేంట‌ని ఫిరాయించిన పార్టీని గట్టిగా ప్ర‌శ్నించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీచేయడం లేదని బుట్టా రేణుక గ‌తంలో తెలిపారు. 2019 ఎన్నికల్లో మళ్లీ కర్నూలు ఎంపీగానే పోటీ చేస్తానని… ఈసారి మాత్రం టీడీపీ తరుపున కర్నూలు ఎంపీగా పోటీ చేస్తానన్నారు. ఇవ‌న్ని ఆమె టీడీపీలో చేరే ముందు చేసిన వ్యాఖ్య‌లు. కానీ ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలు ఆమె మాట‌లు ఆచ‌ర‌ణ‌లో క‌నిపించే దాఖ‌లాలు లేవు.

ఇటీవ‌ల టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల క‌స‌ర‌త్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి క‌ర్నూలు జిల్లా పైనే ఫోక‌స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఆయన ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఉన్న రెండు ఎంపీ స్థానాల్లో కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, నంద్యాల నుంచి ఎస్‌పీవై రెడ్డిని బరిలోకి దించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు స‌మాచారం. ఇదే గ‌నుక నిజ‌మైతే బుట్టా రేణుక ఎంపీ ప‌ద‌వి ఆశ‌లు గ‌ల్లంతైన‌ట్టే. ఇక చివ‌రి ఆప్ష‌న్‌గా జిల్లాలోని ఏదైనా నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందే.

కానీ లిస్ట్‌లో ఎక్క‌డా కూడా బుట్టా రేణుక పేరు క‌నిపించిన, వినిపించిన దాఖ‌లాలు లేవ‌ని తెలుగు త‌మ్ముళ్లు చ‌ర్చించుకుంటున్నారు. ఇవ‌న్ని చూస్తుంటే బుట్టా రేణుకు రాజ‌కీయ జీవితానికి చ‌ర‌మ‌గీతం పాడిన‌ట్టే కనిపిస్తుంది. ఏం జ‌రుగుతుందో వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -