Monday, April 29, 2024
- Advertisement -

క‌త్తి దాడి ఘ‌ట‌న‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

- Advertisement -

తనను చంపేందుకు చంద్రబాబు కుట్రచేశారని వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలో జరిగిన కత్తి దాడి వెనక చంద్రబాబు హస్తముందని విమర్శించారు. విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బహిరంగ సభలో తనపై జరిగిన దాడి గురించి జగన్ ప్రజలకు వివరించారు. ఏపీ ప్రభుత్వం విచారణపై నమ్మకం లేదని..స్వతంద్ర దర్యాప్తు సంస్థతో ఎందుకు దర్యాప్తు చేయించడం లేదని జగన్ ప్రశ్నించారు.

తనను మట్టుబెట్టేందుకు మార్చినెలలోనే చంద్రబాబు నాయుడు ప్లాన్ వేశారని జగన్ వివరించారు. అందుకు ఓ సినీనటుడును తన దగ్గరుకు తెచ్చుకున్నారని అతడికి శిక్షణ ఇచ్చాడన్నారు. ప్రతిపక్ష నేతపై దాడి జరిగిన తర్వాత రాష్ట్రం అల్లకల్లోలమైపోతుందని ప్రభుత్వం కుప్పకూలిపోతుందని ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగమేనని చెప్పించారన్నారు. ఇదంతా బీజేపీ చేస్తున్న ఆపరేషన్ అంటూ చెప్పించినట్లు ధ్వజమెత్తారు. ఆ సినీనటుడు చెప్పిన స్క్రిప్ట్ ను ఓ మీడియా పదేపదే ప్రజలకు చూపించిందని చెప్పుకొచ్చారు.

ఎయిర్‌పోర్టు రెస్టారెంట్ ఓనర్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని జగన్ చెప్పారు. అసలు రెస్టారెంట్‌లోకి కత్తి ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. హత్యాయత్నం చేసిన వ్యక్తిని తన అభిమానిగా చిత్రీకరించి తప్పుడు ప్రచారం చేశారని జగన్ మండిపడ్డారు.

ఒక వేళ హత్యాయత్నాంలో ప్రతిపక్ష నేత చనిపోతే కేంద్రంపై నెట్టేద్దామని ఒక వేళ ఫెయిల్ అయితే ఆపరేషన్ గరుడలో భాగమేనని చెప్పొచ్చు అంటూ తెలివిగా ప్లాన్ చేశారని ఆరోపించారు. హోటల్ యజమాని హర్షవర్ధన్ చౌదరి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరన్నారు. నిందితుడు శ్రీనివాస్ అతని దగ్గరే పని చేస్తున్నారని జగన్ గుర్తు చేశారు.

హత్యాయత్నం జరిగిన గంట తర్వాత డీజీపీ ఆర్పీ ఠాకూర్, హోం మంత్రి చినరాజప్పలు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్స్ తో మీడియా ముందుకు వచ్చారని జగన్ చెప్పారు. అలాగే చంద్రబాబుకు చెందిన మంత్రులు వచ్చి జగన్ పై దాడి చేసింది జగన్ అభిమానేనని తప్పుడు ప్రకటనలు చేశారని మండిపడ్డారు.

ఘటన జరిగిన గంట లోపే తన వారితో చేయించి జగన్ అభిమాని అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కుట్రపన్నారని జగన్ మండిపడ్డారు. ఫ్లెక్సీ చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు. హత్య జరిగిన గంట తర్వాత ఫ్లెక్సీ విడుదల చేస్తారని అందులో నిందితుడు ఫోటో నా ఫోటో ఉంటుందని కానీ పైన వైఎస్ఆర్ ఫోటో కానీ విజయమ్మ ఫోటో కానీ, సోదరి షర్మిల ఫోటో కానీ ఉండదని పైన గరుడ పక్షి ఫోటో ఉంటుందని దుయ్యబుట్టారు.

హత్యాయత్నం అనంతరం ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు తాను హైదరాబాద్ వెళ్లిపోయినట్లు తెలిపారు. తాను ఎవరిమీద కామెంట్ చెయ్యలేదన్నారు. ఎందుకు జరిగింది ఎలా జరిగిందో తెలియదు కాబట్టి ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని షర్ట్ అక్కడే వదిలి హైదరాబాద్ కు వెళ్లిపోయానన్నారు.

ఆపరేషన్ గరుడను కూడా చంద్రబాబే సృష్టించారని జగన్ విమర్శించారు. కేంద్రం ఆధీనంలో ఉన్న ఎయిర్‌పోర్టులో తాను చనిపోతే..అది ఏపీ ప్రభుత్వం మీదకు రాదని చంద్రబాబు భావించారని చెప్పారు. విఫలమైతే ఆపరేషన్ గరుడ పేరు చెప్పి తప్పించుకోవచ్చని కుట్ర చేశారని అన్నారు. చనిపోయిన తర్వాత వైఎస్‌ ఫొటోతో పాటు తన ఫొటో ఉండాలన్నదే తన ఆకాంక్షని జగన్ చెప్పారు. అంతేగానీ సీఎం అయ్యి డబ్బులు సంపాదించాలన్న ఆశ లేదని స్పష్టంచేశారు. చంద్రబాబు నాయుడు లాంటి దుష్టశక్తులు ఎన్ని కుట్రలు చేసినా తాను ప్రజల కోసం నాపోరాటం ఎన్నటికీ ఆగిపోదు. నా సంకల్పం ఎన్నటికి సడలిపోదు. నా ఒంట్లో చివరి నెత్తురు బొట్టు కూడా ప్రజల కోసమే తపిస్తానని హామీ ఇచ్చారు జ‌గ‌న్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -