Thursday, May 9, 2024
- Advertisement -

ఇప్పుడే పుట్టుకొచ్చిందా నంద్యాల మీద ప్రేమ‌…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక గెలుపుకోసం చంద్ర‌బాబు నాయుడు ఆప‌సోపాలు ప‌డుతున్నారు..నంద్యాల ప‌ర్య‌ట‌న‌లో ఎన్నిక‌ల స‌భ కాద‌ని చెబుతూనె ప‌దే ప‌దేమా అ భ్య‌ర్తిని గెలిపించండంటూ అడుక్కోవ‌డం మొద‌లు పెట్టారు. నిస్సిగ్గుగా పిరాయంపుల‌ను ప్రోత్స‌హించి నీతి సూత్రాలు ప్ర‌జ‌ల‌కు చెప్తున్నారు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాక‌ముందె రెండు సార్లు నంద్యాల ప‌ర్య‌ట‌న చేసిన బాబు ప‌రిస్థితి ఎంటో తెలుసుకోవ‌చ్చు.
ఒట్టు..‘ఎన్నికల కోసం నంద్యాలను అభివృద్ధి చేయటం లేదు.. చేసే అభివృద్ధి పేద ప్రజల కోసమే’. నిజమేనా.. చంద్రబాబునాయుడు చెబుతున్నారు కాబట్టి నమ్మాలి. చివరకు అభివృద్ధిపనులు జరగాలంటే ప్రతిపక్షంలో ఉంటే కుదరదు అని స్పష్టంగా సంకేతాలను పంపి 21 మంది వైసీపీ ఎంఎల్ఏలను ఫిరాయింపులకు ప్రత్సోహించిన చరిత్ర చంద్రబాబుది. అందులో భాగమే వైసీపీ తరపున గెలిచిన భూమా నాగిరెడ్డిని బలవంతంగా టిడిపిలోకి లాక్కున్నది విషయం అందరికీ తెలిసిందే.
టిడిపిలో ఉన్నంతకాలం భూమాను రకాలుగా వేధించారు. చివరకు రౌడీషీటర్ తెరిచారు. ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. ఆఖరకు అనారోగ్యంతో ఉంటే అరెస్టు వారెంటు జారీ చేయటానికి పోలీసులను ఆసుపత్రికి కూడా పంపిన ఘనమైన చరిత్ర చంద్రబాబుది. ఎలాగైనా పార్టీలోకి లాక్కున్నాడు.
అయితే కొంతకాలం తర్వాత తాను పార్టీ మారినా నియోజకవర్గంలో అభివృద్ధి జరగటం లేదని వాపోయిన విషయమూ అందరికీ తెలిసిందే. అంటే భూమా మరణించే వరకూ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధీ జరగలేదన్నది వాస్తవం. ఉపఎన్నిక తప్పదని తేలిందగ్గర నుండి నియోజకవర్గంలో చంద్రబాబు చేస్తున్న విన్యాసాలు అందరూ చూస్తున్నదే. ఇంత హడావుడి చేస్తున్నా టిడిపి అభ్యర్ధి గెలుస్తారా అంటే నమ్మకం లేదు. జిల్లా నేతలను కాకుండా పదిమంది మంత్రులు, 25 మంది ఎంఎల్ఏ, 5 ఎంఎల్సీలను రంగంలోకి దింపారంటేనే గెలుపుపై ఎంతగా ఆందోళనలో ఉన్నారో స్పష్టమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -