Wednesday, May 8, 2024
- Advertisement -

బాబు స్కెచ్‌కి జగన్ కౌంటర్ స్కెచ్….. వైకాపాలో బూచేపల్లి ఎపిసోడ్ సుఖాంతం

- Advertisement -

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఏం చేశావ్? అమరావతిలో ఒక్క శాశ్విత భవనానికి అయినా కనీసం శంకుస్థాపన చేశావా? పోలవరం పూర్తిచేయగలవా? రైల్వేజోన్, హోదా తీసుకువచ్చావా? రుణమాఫీ హామీలు అమలు చేశావా? లాంటి ప్రశ్నలన్నింటికి చంద్రబాబు దగ్గర సమాధానం ఉండదు. మహా అయితే జగన్ వచ్చినా ఇంతకుమించి ఏం చేయలేడు అని మాత్రం దబాయిస్తాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయం పక్కనపెడితే వ్యక్తిగత స్వార్థానికి సంబంధించిన విషయాల్లో మాత్రం నైతిక విలువలు అన్నింటినీ చంపేస్తూ చంద్రబాబు గట్టి విజయాలే సాధించాడు. అభివృద్ధి చేసి 2019లో గెలవడం కష్టం అని తెలుసు కాబట్టే ప్రతిపక్ష వైకాపాను పూర్తిగా లేకుండా చేస్తే 2019లో కూడా అధికారం సొంతమవుతుందని భావించాడు. అలాగే ఆ ఎన్నికల్లో డబ్బులు విచ్చలవిడిగా పంచడం కోసం పచ్చ బ్యాచ్ దగ్గర గట్టిగా నిధులు ఉండాలి కాబట్టి అవినీతిని పూర్తిగా సమర్థించడం మొదలెట్టాడు. అందుకే భారతదేశంలోనే నం.1 అవినీతి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రకెక్కింది.

చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ జగన్‌ని మాత్రం పూర్తిగా దెబ్బతీయలేకపోయాడు అన్నది నిజం. ముఖ్యంగా జగన్‌కి ఉన్న ప్రజాబలం రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇక నిబద్ధత ఉన్న నాయకులు కూడా జగన్‌తోనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా దర్శి నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న బూచేపల్లి కుటుంబం కూడా ఆ బాటనే నడిచింది. అధికారంలో ఉన్న టిడిపి పెద్దలు ఓ వైపు అన్ని విషయాల్లోనూ బూచేపల్లి కుటుంబాన్ని దెబ్బతీస్తూ……మరోవైపు టిడిపిలోకి వస్తారా రారా అని ప్రలోభాలకు తెరతీయడంతో ఒక టైంలో పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నాడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి. జగన్‌కి కూడా అదే విషయం చెప్పాడు. అదే టైంలో బాబు భజన మీడియా అంతా కూడా జగన్‌కి బూచేపల్లి దూరమయ్యాడని రాసేసింది. బాబు స్కెచ్ వర్కవుట్ అయింది అన్నట్టుగా వార్తలు వండారు. అయితే బూచేపల్లి మాత్రం పచ్చ బ్యాచ్ అందరికీ షాక్ ఇస్తూ జగన్‌తో ఉండాలని నిర్ణయించుకున్నాడు. టిడిపి దుర్మార్గాలపై, అనైతిక వ్యవహారాలపై పోరాడాలని నిర్ణయించుకున్నాడు. పాదయాత్ర సందర్భంగా జగన్‌ని కలిసిన బూచేపల్లి 2019లో వైకాపా తరపున పోటీచేస్తానని….బాబు కుట్రలను, ప్రలోభాలను ఎదిరించి విజయం సాధించడం కోసం ఎంత ప్రయత్నం అయినా చేస్తానని మాట ఇచ్చాడు. జగన్ పాదయాత్ర నుంచే స్ఫూర్తి పొందానని చెప్పుకొచ్చాడు. ఆ రకంగా బాబు కుటిలయత్నాలకు బూచేపల్లి గట్టి ఝలక్ ఇవ్వడం……వైకాపా తరపునే నిలబడతానని చెప్పడం మాత్రం వైకాపా శ్రేణుల్లో నైతిక బలాన్ని పెంచుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -