Tuesday, April 30, 2024
- Advertisement -

చిత్తూరులో ఆ ముగ్గురు నేత‌లే టార్గెట్

- Advertisement -

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న చిత్తూరులో జిల్లాలో అధికార‌, విప‌క్షాలు ఎత్తులు పై ఎత్తులు జోరుగా క‌నిపిస్తున్నాయి. ఎన్నికలకు మరికొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ మ‌రికొద్ది రోజుల్లో రానున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తాము గెలవాల్సిన సీట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఇక చిత్తూరు జిల్లాలో ఇక్కడి టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ కొన్ని స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించాల‌ని ఇరు పార్టీలు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి.

అధికార పార్టీ ముఖ్యంగా కొంద‌రు వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేత‌ల‌పై ఫోక‌స్ చేసింది. టీడీపీ టార్గెట్ లిస్ట్‌లో నగరి ఎమ్మెల్యే రోజా, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నట్టు స‌మాచారం. తమను విమర్శించడంతో అందరికంటే ముందుండే రోజాను ఓడించేందుకు టీడీపీ ప్రత్యేకంగా వ్యూహారచన చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తోంది. ఇక పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించే బాధ్యతను పీలేరు టీడీపీ అభ్యర్థి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి అప్పగించారు చంద్రబాబు. ఇక్కడ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి మరదలు అనూషారెడ్డిని టీడీపీ పోటీలో దింపనుంది. ఇక చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఓడించాలని వ్యూహరచన చేస్తున్న టీడీపీ…ఇక్కడి నుంచి పులవర్తి నానిని రంగంలో దింపింది.

ఇక వైఎస్ఆర్‌సీపీ చంద్రబాబు సహా మరో ఇద్దరిని టార్గెట్ చేస్తోంది. పీలేరులో టీడీపీ త‌ర‌పున‌ పోటీ చేయనున్న కిషోర్ కుమార్ రెడ్డిని ఓడించే బాధ్యతను కూడా వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక చివరగా కుప్పంలో చంద్రబాబుకు పోటీగా చంద్రమౌళిని మరోసారి పోటీలో నిలపాలని నిర్ణయించుకుంది. మొత్తానికి చిత్తూరు రాజకీయాల్లో అవతలి పార్టీల్లోకి కీలక నేతలను టార్గెట్ చేసిన టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలో ఎవ‌రి వ్యూహ ర‌చ‌న‌లు ఫ‌లిస్తాయో వేచి చూడాలి మ‌రి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -