Tuesday, April 30, 2024
- Advertisement -

వైసీపీఎల్పీ స‌మావేశంలో తీవ్ర భావోద్వేగానికి లోన‌యిన సీఎం జ‌గ‌న్..

- Advertisement -

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. ఈ భేటీకి వైసీపీ శాసనసభ్యులు హాజరయ్యారు. సమావేశంలో మంత్రివర్గ కూర్పు.. అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. అలాగే పలు కీలక నిర్ణయాలను కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది. రేపు 25 మందితో కేబినేట్ ఉంటుంద‌ని జ‌గ‌న్ తెలిపారు. కేబినేట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలుగా అవ‌కాశం క‌ల్పించ‌డం దేశ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌న‌ర్హం.

వైసీపీఎల్పీ స‌మావేశంలో జ‌గ‌న్ భావోద్వేగానికి గుర‌యిన‌ట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల‌ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు స‌మాచారం. గత ఐదేళ్ల కాలంలో వైసీపీ నేతలు ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గైరన జగన్… ఇక మొత్తం 25 మంది మంత్రులతో పూర్తిస్థాయి కేబినెట్‌ ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

తనతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తు చేసుకున్నారట. అధికారం లేకపోయినా.. ఈ తొమ్మిదేళ్లు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తనతో పాటు ప్రయాణాన్ని కొనసాగించామని వ్యాఖ్యానించారట. ఎవరికీ అన్యాయం చేయను.. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానంటూ భరోసా ఇచ్చారట. ఎవరినీ విస్మరించను.. ఎవర్నీ వదులుకోనని చెప్పారట. అందరం కలిసి ఏపీ ప్రజలకు సేవ చేద్దామని నేతలకు పిలుపునిచ్చారు.

జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌ల‌తో సీనియర్ నేతలు కూడా భావోద్వేగానికి గురయ్యారు.. కొందరు కన్నీటిపర్యంతమయ్యారట. మంత్రివర్గ కూర్పుపైనా పార్టీ సీనియర్ నేతలు జగన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్ని వ‌ర్గాల వారికి స‌మ‌న్యాయం చేసే విధంగా జ‌గ‌న్ ముందుకెల్తున్నార‌ని హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఏది ఏమైనా వైఎస్ జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం దేశ‌చ‌రిత్ర‌లో ఓ నూత‌న అధ్యాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -