Friday, April 26, 2024
- Advertisement -

రెండేళ్ల పాలనపై పుస్తకం విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేశారు. తాడేపలి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రివర్గ సహచరులు, అధికారుల సమక్షంలో సీఎం జగన్ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నానని.. రాష్ట్రంలో 86 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు చేరాయని అన్నారు.

రాష్ట్రంలో వివిధ పథకాల కింద అర్హుల ఖాతాల్లో నేరుగా రూ.95,528 కోట్లు జమ చేసినట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వం ప్రజలకు చేయని న్యాయం తాను చేస్తున్నానని అన్నారు. ఈ రెండేళ్ల కాలంలో 94.5 శాతం హామీలను పూర్తి చేశామని స్పష్టం చేశారు. వాటిలో 66 శాతం పథకాలు అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసమే అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 1.64 కోట్ల నివాస గృహాలు ఉంటే, వాటిలో 1.41 కోట్ల గృహాలు ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందుతున్నాయని తెలిపారు.

ప్రభుత్వ పథకాలపై 2 డాక్యుమెంట్లను రూపొందించి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. వివిధ ప్రభుత్వ పథకాల కింద ప్రజలకు లబ్ధి చేకూర్చామని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరే కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు. అందరి సహకారంతో దిగ్విజయంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నామని చెప్పారు.

లాక్‌డౌన్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలుగులో ట్వీట్

10 మంది బాలీవుడ్ సెలబ్రెటీలతో ప్రభాస్ సినిమా?

ఆ సెంటిమెంట్ తో భయపడుతున్న.. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -