Monday, April 29, 2024
- Advertisement -

టీఆర్ఎస్‌ను ఢీకొట్ట‌డానికి తెలంగాణాలో మ‌హాకూట‌మి..

- Advertisement -

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఓట‌మే ల‌క్ష్యంగా తెలంగాణాలో మ‌హాకూట‌మి ఏర్ప‌డింది. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ మూడు పార్టీలు ఏకతాటిపైకి వచ్చి మహాకూటమిగా ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని గద్దెదించడమే తమ లక్ష్యమని తెలంగాణలో ఏర్పాటు అయిన మహాకూటమి స్పష్టం చేసింది.

హైదరాబాద్ పార్క్ హయత్‌ హోటల్‌లో సమావేశమైన ముఖ్య నేతలు.. పొత్తులపై చర్చలు జరిపారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్, టీ-టీడీపీ అధ్యక్షుడు రమణ, సీపీఐ నేత చాడా వెంకటరెడ్డితో పాటూ ముఖ్య నేతలు హాజరయ్యారు. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఎన్నికల్లో మహా కూటమిగా ఏర్పడి.. పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పాటు అయినట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మూడు పార్టీలు కలిసి కామన్ మేనిఫెస్టో తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అలాగే ముందస్తుపై సుప్రీంలో పిటిషన్ వేయాలని నిర్ణయించారు. త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -