Thursday, May 9, 2024
- Advertisement -

వైసీపీలో చేర‌నున్న మాజీ మంత్రి…

- Advertisement -

ఎన్నిక‌ల వేల క‌డ‌ప‌జిల్లాలో వైసీపీకీ జోష్ పెరుగుతోంది. బ‌ల‌మైన నాయ‌కుల‌ను టీడీపీలో చేర్చుకొని త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో వైసీపీ హ‌వాను త‌గ్గించాల‌ని బాబు వ్యూహాలు ర‌చించారు. జ‌గ‌న్‌ను దెబ్బ కొట్టాల‌ని బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలు బెడిసి కొడుతున్నాయి. జిల్లాలో ఉన్న ఒకే ఒక్క టీడీపీ ఎమ్మెల్యే మేడా కూడా వైసీపీ గూటికి చేరుకున్నారు. ఇప్పుడు తాజాగా మ‌రో మాజీ మంత్రి వైసీపీ కండువా క‌ప్పుకోవ‌డానికి రెడీ అయ్యారు.

ఆయ‌న ఎవ‌రో కాదు మైదుకూరు చెందిన మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి . డీఎల్ పార్టీలో చేర‌డానికి ఆనం ముఖ్య‌పాత్ర పోషించిన‌ట్లు తెలుస్తోంది. ఆనం డీఎల్‌తో జ‌రిపిన‌ సంప్ర‌దింపులు ఫ‌లించ‌డంతో ఆయ‌న పార్టీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. హైద‌రాబాద్‌లో జ‌గ‌న్‌తో డీఎల్ భేటీ అయిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

గ‌తంలో డీఎల్‌కు వైసీపీ, టీడీపీనుంచి ఆఫ‌ర్లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. నెల రోజుల క్రితం డీఎల్ రవీంద్రారెడ్డి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. మైదుకూరు టికెట్‌ను ఆయ‌న‌కు కేటాయిస్తున్నార‌ని వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. అయితే మైదుకూరు నుండి తానే బరిలో ఉంటానని పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించ‌డంతో డీఎల్‌కు షాక్ త‌గిలింది.

బీఫామ్ కోసం ఏపార్టీని అడుక్కోవాల్సిన అస‌రంలేద‌ని ఇండిపెండెంట్‌గా కూడ బరిలోకి దిగాలని డీఎల్ ప్ర‌క‌టించారు. ఆనం ఎంట‌ర్ అవ‌డంతో సీన్ మారిపోయింది. జ‌గ‌న్‌తో భేటీ అవ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. త్వ‌ర‌లోనె అధికారికంగా జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేర‌నున్నారు. ప్ర‌స్తుతం వైసీపీ త‌రుపునుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ర‌ఘురామిరెడ్డి ఉన్నారు. అయితే డీఎల్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా లేకుంటే ఎమ్మెల్సీ ఇస్తారా అన్న‌ది వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -