Tuesday, April 30, 2024
- Advertisement -

ప్ర‌సెమీట్‌లో స‌ర్వేల ఫ‌లితాల‌ను వెల్ల‌డించిన బాబు

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక గెలుపుపై యావ‌త్తు దేశం మొత్తం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఎప్పుడు జ‌ర‌గ‌ని ఖ‌రీదైన ఎన్నిక‌గా చెప్పుకుంటున్నారు. ఎన్నిక ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు ఈసీ ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. ఇవాల సాయంత్రం 6 గంట‌ల‌లోపు క్యూలో ఉన్న వారంద‌రు ఓట హ‌క్కును వినియేగించుకోనున్నారు.

ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్న స‌మ‌యంలో ఎవ‌రైనా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. కాని చంద్ర‌బాబు మాత్రం కోడ్ ఉల్లంఘించార‌నె వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. సరిగ్గా తెల్లారితే పోలింగ్ అనగా సాయంత్రమే చంద్రబాబు నాయుడు స్పెషల్ ప్రెస్ మీట్ ని పెట్టి ఉప ఎన్నిక కి సంబంధించి సర్వే ఫలితాలు చెప్పడం కోడ్ ఉల్లంఘన లోకి వస్తుంది అంటున్నారు విశ్లేషకులు.

జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డం వ‌ర‌కు బాగానె ఉంది కానీ సర్వే ఫలితాలు సరిగ్గా కోడ్ ఉన్న టైం లో మాట్లాడడం పట్ల సర్వత్రా సీరియస్ మాటలు వినపడుతున్నాయి. ఆయన వెల్లడించిన సర్వే ఫలితాలు నంద్యాల ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ మీడియా ఛానల్స్ వారు ఆ ప్రెస్ మీట్ ని సాయంత్రం లైవ్ టెలీకాస్ట్ చెయ్యడం తో పాటు ఉదయం పూట కూడా మళ్ళీ టెలీకాస్ట్ చేయ‌డం ఇప్పుడు స‌మ‌స్య‌గా మారింది.

పోలింగ్‌కు కొన్ని గంటల ముందర చంద్రబాబు సీఎం స్థానం లో ఉండి మరీ కోడ్ ని ఉల్లంఘించారు అనే మాట వినపడుతోంది. ఇప్ప‌టికే ఈసీకి ఫిర్యాదు చేసేంద‌కు వైసీపీ నాయ‌కులు సిద్ద‌మ‌వుతున్నారు. మ‌రి చంద్ర‌బాబుపై చ‌ర్య‌లు ఉంటాయా అన్న‌ది అనుమాన‌మే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -