Sunday, April 28, 2024
- Advertisement -

ప్రశాంత్ కిశోర్ ఎంత పని చేశాడు

- Advertisement -

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ త్వరలో ఎంపీ కాబోతున్నారు. అయితే రాజ్యసభ నుంచా ? లేక లోక్ సభకు పోటీ చేస్తారా ? అనేది తేలాల్సివుంది. ఇంతకీ ఏ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచా ? అని ప్రశ్నించకండి. ఎందుకంటే.. కొద్దిరోజుల క్రితం ప్రశాంత్ కిశోర్ సంచలన ప్రకటన చేశారు. తాను 2019 ఎన్నికల కోసం ఏ పార్టీకి పని చేయనని చెప్పారు. తన స్వరాష్ట్రం బీహార్ వెళ్లి పోయి మూలాల్లోకి వెళ్లిపోతానని తెలిపారు. లేదంటే తాను మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలకు పనిచేసిన గుజరాత్ రాష్ట్రం వెళ్లిపోయి వర్క్ చేసుకుంటానని చెప్పారు. ఆయన చెప్పినట్టే నేడు జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ)లో ప్రశాంత్ కిశోర్ చేరుతున్నారు. జేడీయూ రాష్ట్ర కార్యవర్గం సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈ ఉదయం ప్రశాంత్ కిశోర్ ఓ ట్వీట్ చేశారు. ‘‘బిహార్ నుంచి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఉత్తేజభరితంగా ఉంది’’ అని అందులో పీకే పేర్కొన్నారు. ఆయనకు జేడీయూ చీఫ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ సభ్యత్వం ఇస్తారని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. త్వరలో ఆయనకు జేడీయూ నుంచి ఎంపీ పదవి ఇవ్వబోతున్నట్టు సమాచారం. అయితే తమ పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తారా ? లేక లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా ? అనేది తేలాల్సి ఉంది. కొందరు మాత్రం నామినేటెడ్ పోస్ట్ లేదా, ఎమ్మెల్సీ వంటి పదవులు జేడీయూ తరఫున్ పీకేకు ఇస్తారనే ప్రచారం కూడా చేస్తున్నారు.

కానీ పీకే నేరుగా చట్టసభలో తన గొంతు వినిపించాలని ఆశ పడుతున్నారని, అందువల్లే నితీశ్ కుమార్ కూడా రాజ్యసభ లేదా లోక్ సభ ఎంపీ పదవి కట్టబెట్టేందుకు సిద్ధపడ్డారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని పీకే అభిమానుల్లో చర్చ జరుగుతోంది. కాకపోత రాజకీయ వ్యూహకర్తగా నేషనల్ వైడ్ పేరు పొందిన ప్రశాంత్ కిశోర్ ఎంపీగా అయితేనే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సమస్యలపై అవగాహన ఉన్న పీకే ఎంపీగా అయితే ఆయా సమస్యలపై పార్లమెంట్ లో మాట్లాడి జేడీయూకి ఫుల్ మైలేజ్ తెస్తాడని, భావించే నితీష్ కూడా ఆయనకు ఎమ్మెల్యే కంటే ఎంపీ పదవే బెటరని ఆలోచిస్తున్నారంట. ప్రశాంత్ కిశోర్ 2014 సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీ ఎన్నికల ప్రచారం చేశారు. మోడీని అధికారంలోకి తేవడంలో పీకే కృషి కీలకం. 2015లో జేడీయూ-ఆర్జేడీ కూటమి విజయం కోసం ఆయన వేసిన ప్రణాళికలు, వ్యూహాలు, ఎత్తుగడలు ఫలించాయి. నితీష్ కు సీఎం కుర్చీని కట్టబెట్టాయి. తర్వాత వైఎస్ఆర్ సీపీ రాజకీయ వ్యూహకర్తగా పని ప్రారంభించారు. వైఎస్ జగన్ కు ఇప్పటికే ఓ మార్గనిర్దేశం చేశారని, ఇక ఆ పార్టీ విజయతీరాలకు చేరడమే ఆలస్యమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పీకే తాను స్థాపించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ( ఐ ప్యాక్) బాధ్యతలను సమర్ధవంతమైన వ్యక్తుల చేతిలో పెట్టేశారు. దేశంలోని ప్రధాన సమస్యలు, రాష్ట్రాల వారీగా రాజకీయ అంశాలు, వ్యూహాలు, దేశ అభివృద్ధికి ప్రణాళికలు వంటి అంశాలపై ఐ ప్యాక్ వర్క్ చేస్తోంది. ఆ సంస్థ అందించనున్న కీలక సమాచారంతో ఇక పీకే రాజకీయ భవిష్యత్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు దూసుకుపోతుందని రాజకీయ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -