Monday, April 29, 2024
- Advertisement -

బీజేపీ గెలుపు వెన‌క ఓ వ్య‌క్తి

- Advertisement -
  • గుజ‌రాత్‌లో అమిత్ షా శిష్యుడి గెలుపు
  • యూపీ, రాజస్థాన్, జార్ఖండ్, బీహార్ ఎన్నిక‌ల్లోనూ కీల‌క పాత్ర‌

గుజ‌రాత్ రాష్ట్రాన్ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ వ‌దిలిన త‌ర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయి. మోదీ లేకుండా గుజ‌రాత్‌లో ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డంతో బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలవాల‌నే త‌లంపుతో అస్త్ర‌శ‌స్త్రాలు చేసి… అప‌పోపాలు ప‌డి.. తాయిలాలు ఇచ్చి ఇలా అన్నీ ప్ర‌యత్నాలు చేసి ఎట్ట‌కేల‌కు గ‌ట్టెక్కింది. కాంగ్రెస్‌తో తీవ్రంగా పోటీప‌డి మ‌రీ క‌మ‌లం ప‌రువు నిలుపుకుంది. బీజేపీ ఆరోసారి మ‌ళ్లీ అధికారం కొన‌సాగించ‌నుంది. అయితే గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన వ్యూహం ఒక‌రిది. ఈ విజ‌యం వెన‌కాల ప్ర‌ధాన శ‌క్తి ఒక‌రు ఉన్నారు. అత‌డే అమిత్ షా శిష్యుడు. ఇత‌డు

గుజ‌రాత్‌లో బీజేపీ విజయం వెనుక ప్రధాన పాత్ర ఓ వ్య‌క్తి పోషించాడు. భూపేంద్ర యాదవ్ అమిత్ షా శిష్యుడిగా పేర్కొంటారు. అందుకే అత‌డిని బీజేపీ గుజ‌రాత్ ఎన్నికల ప్ర‌చార సార‌థిగా ప్ర‌ధాని మోదీ ఎంపిక చేశారు. బీసీ నేత అయిన అతడిని ఎంపిక చేసి రాజ‌కీయ వ్యూహాలు రచించారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా ఎన్నిక‌ల్లో విజ‌యానికి ప్ర‌ణాళిక‌లు, వ్యూహాప్ర‌తివ్యూహాలు రూపొందిస్తే వాటిని తూచ తప్పకుండా అమలు చేసే బాధ్య‌త భూపేంద్రది. ఎప్పుడు ప్ర‌జ‌ల ముందు ఉండ‌డు. కానీ తెర వెనుక ఉండి అన్నీ న‌డిపిస్తూ పార్టీని విజ‌యాల బాట ప‌ట్టిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయంలోనూ కీలకపాత్ర పోషించడంతో అమిత్ షా భూపేంద్ర‌కు గుజరాత్ ఎన్నిక‌ల ప్రచార బాధ్య‌త‌లు అప్పగించారు.

ఏప్రిల్‌లో బాధ్య‌త‌లు స్వీక‌రించిన భూపేంద్ర యాద‌వ్ ఎనిమిది నెల‌ల్లోనే గుజ‌రాత్‌పై ప‌ట్టు సాధించాడు. ప‌టేళ్లు, రాజ్‌పుట్‌లు త‌దిత‌ర కుల రాజ‌కీయాలు పెరిగిపోయిన నేప‌థ్యంలో అంద‌ర్నీ స‌మ‌న్వ‌య ప‌రుస్తూ పార్టీని విజ‌యం దిశ‌గా తీసుకెళ్లాడు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌నే క‌సితో కుల సమీకరణాలకు పాల్ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ప్రచార వ్యూహానికి భూపేంద్ర‌యాద‌వ్ పదును పెడుతూ పార్టీ ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. తాజా ఎన్నికల ఫలితాలను చూస్తే ఆయన పట్ల అమిత్‌షా పెట్టుకున్న అంచనాలు తప్పలేదని ఇట్టే తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అంత‌కుముందు భూపేంద్ర‌యాద‌వ్ యూపీ, రాజస్థాన్, జార్ఖండ్, బీహార్ రాష్ట్ర ఎన్నికల్లో బాగా ప‌నిచేశాడు. అత‌డి ప‌నికి మెచ్చి గుజ‌రాత్ ఎన్నిక‌ల బాధ్య‌త అప్ప‌గించారు. రాజస్థాన్‌లో మొత్తం 200 స్థానాల్లో బీజేపీ 163 సీట్లు, జార్ఖండ్ అసెంబ్లీలో బీజేపీ కూటమి 82 స్థానాల్లో 47 స్థానాలు సాధించేందుకు తీవ్రంగా భూపేంద్ర యాద‌వ్ కృషి చేశాడు.

ఇక భూపేంద్ర‌కు వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో బాగా వాడుకునే ప‌రిస్థితి క‌నిపించేలా తెలుస్తోంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో భూపేంద్ర యాద‌వ్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఇక ద‌క్షిణ భార‌త‌దేశంపై ఫోక‌స్ పెట్టేలా ఉన్నాడు. ఆ విధంగా బీజేపీ ఎప్ప‌టినుంచో ప్ర‌ణాళిక‌లు వేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -