Wednesday, May 1, 2024
- Advertisement -

జ‌మ్మ‌ల‌మ‌డుగులో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ… భారీగా బ‌ల‌గాల మోహ‌రింపు

- Advertisement -

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. వైసీపీ, టీడీపీ వ‌ర్గీయుల మ‌ధ్య మ‌రో సారి యుద్ధ‌వాతావ‌ర‌ణం నెల‌కొంది. పెద్దదండ్లూరులో ఇరువ‌ర్గాల మ‌ధ్య‌ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏంజ‌రుగుతుందోన‌ని ప‌రిస‌ర గ్రామాల ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు.

ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మార‌డంతో ఆదివారంనుంచి పోలీసులు పికెట్‌ను ఏర్పాటు చేయ‌డంతోపాటు భారీగా పోలీసుల‌ను మోహ‌రించారు. ఈ నెల 6వరకు జమ్మలమడుగు పరిసర గ్రామాల్లో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ స్వయంగా.. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

పెద్ద‌దండ్లూరు గ్రామానికి చెంద‌ని సంపత్ అనే వ్యక్తికి గత నెలలో వివాహమయ్యింది. అతడికి ఎంపీ అవినాష్ రెడ్డితో పరిచయం ఉండటంతో కలిసి శుభాకాంక్షలు చెప్పాలనుకున్నారు. దాంతో వారు పెద్ద‌దండ్లూరుకి బ‌య‌లు దేరారు. దీంతోపాటు కొన్ని కుటంబాలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ని సంప‌త్ తెల‌ప‌డంతో అక్క‌డే షామియాను ఏర్పాటు చేశారు.

మంత్రి ఆది వ‌ర్గీయులే వైసీపీలో చేరుతున్నార‌న్న విష‌యం తెలుసుకున్న మంత్రి ఆధి కొడుకు సుధీర్‌రెడ్డి అక్క‌డ ఏర్పాటు చేసిన శ్యామియాతో పాటు కుర్చీల‌ను ధ్వంసం చేశారు. ఇరు వ‌ర్గాల మ‌ధ్య రాళ్లుకూడా విసురుకున్నారు. అదే స‌మ‌యంలో ఎమ్మెల్సీ రామ‌సుబ్బారెడ్డి త‌న అనుచ‌రుల‌తో మాట్లాడానికి వెల్ల‌డంతో వివాదం పెద్ద‌గా మారింది.

ఈ విష‌యం తెలుసుకున్న వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి గ్రామానికి వెల్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా పోలీసులు మార్గ‌మ‌ధ్యంలో అడ్డుకున్నారు. ఉద్రిక్త ప‌రిస్థితులు చ‌ల్లార‌క‌పోవ‌డంతో 144 సెక్స‌న్ విధించిన పోలీస‌లు బ‌ల‌గాల‌ను భారీగీ మోహ‌రించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -