Thursday, April 25, 2024
- Advertisement -

పుదుచ్చేరిలో.. వారసత్వ రాజకీయాల పై షా ప్రకంపన..!

- Advertisement -

కాంగ్రెస్​ వారసత్వ రాజకీయాల కారణంగా దేశవ్యాప్తంగా కుప్పకూలిపోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా విమర్శలు చేశారు. పుదుచ్చేరిలో ఆ పార్టీ అవినీతికి పాల్పడి.. రూ.15వేల కోట్ల సొమ్మును గాంధీ కుటుంబానికి తరలించిందని ఆరోపణలు చేశారు.

పుదుచ్చేరిలో బిజెపీ ఎన్నికల ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్​ పార్టీపై ధ్వజమెత్తారు షా. పుదుచ్చేరిలో మెజారిటీ కోల్పోయిన కాంగ్రెస్​.. ప్రభుత్వ పథకాలపై దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి.. తన పాలనా కాలంలో అభివృద్ధి పనుల కన్నా.. గాంధీ కుటుంబానికి సేవ చేయడం, అవినీతి సొమ్మును తరలించడంపైనే ఎక్కువ దృష్టి సారించారని ఆరోపించారు.

ఎంతో మంది సీనియర్​ నాయకులు కాంగ్రెస్​ను వీడుతున్నారని.. ఆ పార్టీ వారసత్వ రాజకీయాల వల్లే దేశవ్యాప్తంగా పతనం దిశగా సాగుతోందన్నారు. దేశంలో అంకితభావంతో కూడిన మత్స్య శాఖ లేదన్న రాహుల్​ వ్యాఖ్యలపైనా తీవ్రంగా మండిపడ్డారు షా. రెండేళ్ల క్రితమే మోదీ హయాంలో ఇది ఏర్పాటైందని గుర్తుచేశారు.

ఎస్ఈసీ వైపు గురిపెట్టిన చంద్రబాబు నాయుడు..!

ఆసక్తి రేపుతున్న ఎన్టీఆర్ మాస్క్.. ధర ఎంతో తెలిస్తే షాక్!

ప్రభాస్ ‘స‌లార్’ విడుద‌ల అప్పుడే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -