చంద్రబాబు చేసిన తప్పే.. కే‌సి‌ఆర్ చేస్తున్నారా ?

2019 ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తప్పే.. మళ్ళీ ఇప్పుడు కే‌సి‌ఆర్ చేస్తున్నారా ? అంటే అవుననే సమాధానాలు విశ్లేషకుల వద్ద నుంచి వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికలకు ఒక ఏడాది ముందు నుంచి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం పై ఏ స్థాయిలో విరుచుపడ్డారో అందరికీ తెలిసిందే. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వంతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగిన బాబు.. ఎన్నికలు దగ్గర పడే సమయానికి బాబు వైఫల్యాలను కేంద్రంపైకి నెట్టే ప్రయత్నం గట్టిగానే చేశారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి ఎలా బుద్ది చెప్పారో అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి చూస్తే కే‌సి‌ఆర్ కూడా బాబు బాటలోనే వెళుతున్నాడా ? అనే అనుమానాలు రాక మానవు.

ఎందుకంటే తెలంగాణలో 2018 ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పాటైనది మొదలుకొని గత ఏడాది వరకు కూడా కేంద్ర ప్రభుత్వంపైన, ప్రధాని మోడీ పైన పెద్దగా విమర్శలు చేయని కే‌సి‌ఆర్.. ఈ మద్య కాలంలో కేంద్ర ప్రభుత్వంపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రనికి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని, మోడీ పాలనలో దేశ పరిస్థితి దారుణంగా తయారైందని ఎన్నో కుంభకోణాలకు కేంద్ర ప్రభుత్వం ఆసరాగా నిలుస్తోందంటూ ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు కే‌సి‌ఆర్. ఇక నీతి అయోగ్ ద్వారా తెలంగాణకు కేటాయించాల్సిన నిధులు ఏ మాత్రం విడుదల చేయలేదని, మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చిన్న చూపు చూస్తోందనే సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా తెసుకెల్లే ప్రయత్నం చేస్తున్నారు కే‌సి‌ఆర్. అయితే కే‌సి‌ఆర్ ఇలా ఉన్నఫలంగా కేంద్ర ప్రభుత్వంపై రివర్స్ అవడానికి కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ అత్యంత వేగంగా బలపడుతున్న పార్టీ, వచ్చే ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ కు బలంగా పోటీ ఇచ్చే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నెట్టి ప్రజల్లో సింపతీ వ్యూహాన్ని కే‌సి‌ఆర్ ప్లే చేస్తోన్నట్లు కొందరి వాదన. ఎందుకంటే డబుల్ బెడ్ రూమ్స్అమలు విషయంలోనూ, అలాగే ఇంటింటికి నల్లా అని చెప్పిన కే‌సి‌ఆర్ దాన్ని అమలు చేయడంలోనూ, ఇక దళితబంధు నూ పూర్తి స్థాయిలో అమలు చేయడంలోను, ఇలా చాలా వాటిలో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది కాదనలేని ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు కే‌సి‌ఆర్.. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న మాట. మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా గత ఎన్నికల ముందు ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్రంపై తిరుగుబాటు చేసిన చంద్రబాబుకు ప్రజల నుంచి ఊహించని పరాభవమే ఎదురైంది. ప్రస్తుతం కే‌సి‌ఆర్ కూడా అదే వ్యూహాన్ని పాటిస్తున్న నేపథ్యంలో మరి కే‌సి‌ఆర్ కు ఎలాంటి పరాభవం ఎదురౌతుందో చూడాలి.

Also Read

నేతలు మారితే ఓటర్లు మారతారా ..!

మోడీ జోక్యంతో.. జగన్ వెనక్కి తగ్గుతాడా ?

ఈడీ ని మోడీ వాడుకుంటున్నారా ?

Related Articles

Most Populer

Recent Posts