Thursday, March 28, 2024
- Advertisement -

కొడాలి నానితో జగన్ సంధిస్తున్న అస్త్రం ఫలించట్లేదా..?

- Advertisement -

ఎంతలేదన్నా ఆంధ్రప్రదేశ్ లో కుల ప్రాతిపదకన చాల అంశాలు ముడిపడి ఉంటాయి, పనులు జరుగుతాయి అని చెప్పొచ్చు.. ఇతర రాష్ట్రాలతో ఇక్క ప్రజలు కులానికి ఎక్కువ విలువనిస్తారు. అంతెందుకు ఎన్నికల్లో ఓట్లు కూడా తమ కులపోడికే ఓటు వేస్తారన్న విషం అందరికి తెలిసిన విషయమే.. పాతతరం నాయకులూ ఈ కుంపటిని వెలిగిస్తే ఇప్పటి తరం నాయకులూ సైతం ఈ కుంపటి లో ఆజ్యం పోసి మరీ యా జ్వాలలను రగిలిస్తున్నారు. వారు కూడా అదే కులం విధానాన్ని అనుసరిస్తూ ఈ కులం రొచ్చు ను ఇప్పట్లో వదిలేలా లేరు..

ఈ విషయంలో టీడీపీ ఒక ఆకు ఎక్కువే చదివిందని చెప్పొచ్చు.. పలానా కులం వాడిని తిట్టాలంటే చంద్రబాబు కూడా అదే కులం నాయకుడిని ఉపయోగించి తన చేతికి మట్టి అంటకుండా చూసుకుంటారు..  ఇక జగన్ విషయంలో  కులం అనే సమస్య పూర్తి విరుద్ధంగా ఉంది.. ఇతర సామజిక వర్గాల సంగతి పక్కన పెడితే జగన్ కు కమ్మ వారికి కొంత దూరం ఇంకా మిగిలి ఉందని చెప్పొచ్చు.. అయితే ఆ దూరాన్ని టీడీపీ వాడుకుంటూ జగన్ కమ్మవారికి అన్యాయం చేస్తున్నాడని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేస్తూ జగన్ ని వారి దృష్టిలో మరింత బ్యాడ్ చేస్తుంది. ఇక తన కేభినేట్ లో కూడా జగన్ ఎక్కడా కులాన్ని ఆధారం చేసుకుని మంత్రుల పదవులు ఇవ్వలేదు..

ఇక కమ్మ వారికి నాలుగు మంత్రి పదవులు ఇచ్చారు.. అందులో కొడాలి నాని మంత్రి అయ్యారు.. అయన మొదటినుంచి టీడీపీ పార్టీ కి చెందినా ఎన్టీఆర్ కి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.. యా తర్వాత జగన్ కి విధేయుడిగా మారారు.. అయితే కొడాలి నాని ద్వారా కమ్మ ప్రజలను ఆకట్టుకోవడానికి జగన్ వేస్తున్న ఎత్తులు ఫలించట్లేదు దానికి కారణం కమ్మ వర్గం వారు కూడా కొడాలి ణానికి వ్యతిరేకంగా ఉండడమే.. ఎంతకాదన్నా కమ్మ వారు కన్న కలలను అమరావతి రాజధాని మార్పు విషయంలో జగన్ చెరిపేశారు. ముఖ్యంగా యా ప్రాంతంలో కమ్మ వారు జగన్ పై తీవ్రమైన కోపం తో ఉన్నారు.. దీంతో వారికి జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేసి వారి నమ్మకాన్ని సాధించాలని ఆలోచిస్తున్నారట.. ముందుగా టీడీపీ ప్రచారం చేస్తున్న అవాస్తవాలను తిప్పికొట్టి పార్టీ లో కమ్మవారికి ప్రాధాన్యం పెంచి , వారికి మరింత పదవులు కట్టబెట్టి వారిని తమవైపుకు తిప్పుకోవాలని జగన్ ప్లాన్ వేస్తున్నారట.. మరి జగన్ వ్యూహం ఫలిస్తుందా చూడాలి.. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -