Thursday, May 2, 2024
- Advertisement -

వైసీపీ పార్ల‌మెంట‌రీ క‌మిటీ చ‌ర్చ‌లో అస‌హ‌నం వ్య‌క్తం చేసిన జ‌గ‌న్‌….

- Advertisement -

ఏపీకి ప్ర‌త్యేక‌హోదాను ఇచ్చే ప్ర‌స‌క్తేలేద‌ని కేంద్రం తెల్చి చెప్పినా రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్ష పార్టీలు పోరాడుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఈ అంశ‌మే ప్ర‌ధానం కానుంది. టీడీపీ ప్ర‌త్యేక ప్యాకేజికి ఒప్ప‌కుంటె వైసీపీ మాత్రం ఇప్ప‌టికీ ప్ర‌త్యేక హోదాకోసం పోరాడుతున్నాయి.
గ‌తంలో ప్ర‌త్య‌క హోదాకోసం అవ‌స‌రం అయితే రాజీనామ చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు మ‌ద్ద‌తిచ్చే విష‌యంలో ప్ర‌ధాని మోదీని జ‌గ‌న్ క‌ల‌వ‌డం సంచ‌ల‌నంగా మారింది.త్వ‌ర‌లో పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం కానున్న‌నేప‌థ్యంలో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నేదానిపై వైసీపీ పార్ల‌మెంట‌రీ క‌మిటికి కొంద‌రు ఎంపీలు డుమ్మాకొట్టారు.అయితే దీనిపై జ‌గ‌న్ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది.
ఇలా అయితే పార్టీని ఎలా న‌డ‌పాల‌ని ఎంపీల‌ను అడిగారంట‌.వ్యాపారాలు చేసుకోవ‌ద్దని అన్నందుకే స‌మావేశానికి రాక‌పోతే ఎలాని ప్ర‌శ్నించారు.ఇదే విష‌యంలో ప్ర‌త్యేక హోదాపై రాజీనామ చేయాల‌నే అంశం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.అయితే ఎంపీలు మాత్రం రాజీనామాకు సిద్ధంగా లేమ‌ని చెప్పార‌ట‌. కోట్లు ఖ‌ర్చు పెట్టి ఎన్నిక‌ల్లో గెలిచి ఇప్పుడు రాజీనామ చేపె ఆలోచ‌న లేద‌ని చెప్పారు.
ఒక వేల రాజీనామ చేస్తె మ‌ళ్లీ గెలిచే అవ‌కాశాలపై న‌మ్మ‌కం లేద‌ని వెల్ల‌డించారంట‌.అందుకే రాజీనామ త‌ప్ప వేరే అంశాలు ఏవైనా ఉంటె చెప్ప‌డంతో జ‌గ‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేసి మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కు వెల్లిన‌ట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -