Wednesday, May 8, 2024
- Advertisement -

శిక్ష పడిన వారితో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ రాజకీయం!

- Advertisement -

సీబీఐ మాజీ జేడీ, మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మినారాయణ నోరు తెరిస్తే నీతులు చెబుతారు. అదీ ఇదీ అంటారు. ఈయన సీబీఐ నుంచి ట్రాన్స్ఫర్ అయిన దగ్గర నుంచి నీతులు చెప్పారు. అందులోనూ ఒక వర్గం మీడియా ఈయనను హీరోని చేసింది. ప్రత్యేకించి తెలుగుదేశం అనుకూలురు ఈయనను హీరోని చేశారని వేరే చెప్పనక్కర్లేదు. అలా సంపాదించుకున్న ఇమేజ్‌తో ఇప్పుడు రాజకీయంగా అవకాశం కోసం ఐపీఎస్ హోదాను సైతం వదిలి పెట్టి వచ్చాడీయన.

ఏపీలో వ్యాప్తంగా పర్యటిస్తున్నాడు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఉన్నట్టుండి ఈయనకు ప్రజలు, వారి కష్టాలు, రైతులు గుర్తుకురావడం విశేషమే. ఇక ఈ పర్యటనల్లో ఈయన తీరు ఎలా ఉందో కూడా గమనించాలి. ఇప్పటికే ఈయన తీరు విమర్శలకు గురి అవుతోంది. ఈయన తెలుగుదేశం పార్టీ అనుకూలుడిగా పేరు పొందుతూ ఉన్నాడు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలను ఈయన ఎక్కడా ప్రశ్నించడం లేదు. విధానాల్లో తప్పులను ఎంచడం లేదు.

అదలా ఉంటే.. ఇప్పుడు ఈయన మరో వివాదంలోకి అడుగుపెట్టారు. ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ఈయన అక్కడ అన్నా రాంబాబు అనే వ్యక్తితో కలిసి కనిపించాడు. ఈ అన్నా రాంబాబు ఎవరో కాదు.. మాజీ తెలుగుదేశం పార్టీ నేత. ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశాడు. ఈ రాంబాబు చరిత్ర చాలానే ఉంది. ఈయనపై కొన్ని కేసులున్నాయి. ఒక కేసులో ఈయనకు శిక్ష కూడా ఖరారు అయ్యింది. ఆ మధ్య నంద్యాల ఉప ఎన్నిక అప్పుడు అక్కడ రచ్చ చేసింది అన్నా రాంబాబు కుటుంబీకులే. ఇలాంటి నేపథ్యం ఉంది అన్నా రాంబాబుకు.

ఇప్పుడు ఈ అన్నా రాంబాబుతో లక్ష్మినారాయణ కలిసి కనిపించడం విశేషం. నోరు తెరిస్తే నీతులు చెబుతూ.. వివేకానంద సూక్తులు చెబుతూ వాస్తవంలో మాత్రం ఈయన శిక్షలు ఖరారు అయిన రాజకీయ నేతలతో కలిసికనిపించడం విడ్డూరం కాక మరేమిటి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -