Sunday, April 28, 2024
- Advertisement -

పార్టీ మారేందుకు సిద్ధ‌మైన మాజీ మంత్రి….

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వేడి రాజుకుంటోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో భివిష్య‌త్‌లేని పార్టీల‌నుంచి నాయ‌కులు ఇత‌ర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఒక వైపు ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో అధికార‌, విప‌క్షాల మ‌ధ్య సీట్ల దోబూచులాట ప్రారంభ‌మ‌య్యింది. దీంతో మాజీ మంత్రి ఒక‌రు వైసీపీ తీర్థం పుచ్చుకొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది భాజాపా నాయ‌కుల్లో టెన్స‌న్ మొద‌ల‌య్యింది. వ‌చ్చె ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు ఉంటంఉదా లేక‌పోతె త‌మ‌కు అన‌కూల మైన సీటు వ‌స్తుందా అన్న ప్ర‌శ్న‌లు ఏపీ భాజాపా లీడ‌ర్ల‌ను తెగ వేధించేస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అనేక హామీలు ఇచ్చింన సంగ‌తి తెల‌సిందే. అందులో ప్ర‌ధానంగా ప్ర‌త్యేక‌హోదా, రైల్వేజోన్ ప్ర‌ముఖ‌మైన‌వి. వీటిపై కేంద్రం చేతులెత్తేయండ‌తో ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హావేశాలు నిగురు క‌ప్పిన నిప్పులా ఉన్నాయి. దీంతో ఓట్లు వేస్తారా వేయ‌రా అన్న టెన్స‌న్ ప‌ట్టుకుంది. మ‌రో వైపు టీడీపీతో పొత్తు లేకుండా ఒంట‌రిగా పోటీ చేస్తె డిపాజిట్లుకూడా రావ‌న్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటె మాజీ మంత్రి ఇప్పుడు కొత్త‌దారులు వెతుక్కుంటున్న‌ట్టు గుంటూరు జిల్లాలో జోరుగా వినిపిస్తోన్న టాక్‌. ప‌దేళ్ల కాంగ్రెస్ పాల‌న‌లో ఓ రేంజ్‌లో వెలిగిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఆ త‌ర్వాత బీజేపీలో చేరారు. భాజాపాపై వ్య‌తిరేక‌త వ్య‌క్తమ‌వ‌డంతో వేరే పార్టీలోకి జంప్ అయ్యేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటే జిల్లాలో ఏదో ఒక సీటు నుంచి పోటీ చేద్దామ‌న్న ప్లాన్‌లో ఉన్న క‌న్నా పొత్తు లేక‌పోతే మాత్రం వైసీపీలోకి జంప్ చేసేద్దామ‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ఇప్ప‌టికె వైసీపీ నుంచిఆయ‌న‌కు ఆఫ‌ర్లు ఉన్న సంగ‌తి తెలిసిందే. పెద‌కూరపాడు లేదా గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక సీటు ఇస్తామ‌ని వాళ్లు ఆఫ‌ర్లు ఇస్తున్నా క‌న్నా మాత్రం త‌న‌తో పాటు త‌న కుమారిడికి రెండు సీట్లు కావాల‌ని కండీష‌న్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది. చూడాలి భ‌విష్య‌త్తులో ఏంజ‌రుగుతుందో…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -