Saturday, April 27, 2024
- Advertisement -

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్‌పై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా పది రోజుల పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ పలువురు రాజకీయ పార్టీలు నేతలు, ప్రముఖ ఆర్థికవేత్తలతో భేటీ అవుతారు. మీడియా రంగానికి చెందిన ప్రముఖులను సైతం కలుస్తారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు.

ఈ నెల 22న చండీగఢ్, 26న బెంగళూర్, 27న రాలేగావ్ సిద్ధి, 29 లేదా 30న బెంగాల్, బీహార్ వెళ్లనున్నారు. ఆర్మీ అమరవీరుల కుటుంబాలతో పాటు మూడు వ్యవసాయ చట్టాల రద్దు ఉద్యమ సమయంలో చనిపోయిన రైతుల కుటుంబాలను కేసీఆర్ పరామర్శిస్తారు. వ్యవసాయ చట్టాల రద్దు ఉద్యమంలో దాదాపు 600 మంది మరణించారు. వీరి కుటుంబాలకు 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు.

ఇందుకు సంబంధించి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భవంత్ మాన్ పాల్గొంటారు. 26న బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ సమావేశమవుతారు. 27న రాలేగావ్ సిద్ధిలో సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ అవుతారు. అక్కడి నుంచి షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుంటారు. అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు. 29 లేదా 30న బెంగాల్, బీహార్ పర్యటనకు సీఎం వెళ్లనున్నారు.

వారు బయటకొస్తే చంపేస్తా

బీహార్ కంటే దారుణంగా ఏపీ

దత్తపుత్రుడు అప్పుడెందుకు ప్రశ్నించలేదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -