Sunday, April 28, 2024
- Advertisement -

జ‌గ‌న్‌కు మ‌ళ్లీ ప‌రాభ‌వం త‌ప్ప‌దా?

- Advertisement -

న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి ఉమ్మ‌డి ఆంధ్రప్ర‌దేశ్‌ రాష్ట్రానికి చివ‌రి ముఖ్య‌మంత్రి.రాష్ట విభ‌జ‌న జ‌ర‌గ‌కుండా ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని చెప్పి,చివ‌రి వ‌ర‌కు ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి మోసం చేసిన‌ వ్య‌క్తి కిర‌ణ్ కుమార్ రెడ్డి.ఇక రాష్ట్ర విభ‌జ‌న ఆగ‌దు అని తెలిసిన త‌రువాత ప్ర‌భుత్వ‌న్ని రద్దు చేసి రాష్ట్ర‌ప‌తి పాల‌న‌కు కారకుడ‌య్యాడు కిర‌ణ్‌.2014 ఎన్నిక‌ల‌ప్పుడు కొత్త పార్టీ(స‌మైక్యాంధ్ర పార్టీ)ని స్థాపించాడు.పార్టీ అయితే పెట్టాడు కాని ఎలెక్ష‌న్స్‌లో మాత్రం పోటి చేయ‌లేదు.నాలుగు సంవ‌త్స‌రాలు సైలెంట్‌గా ఉన్న కిరణ్ మ‌ళ్లీ రాజ‌కీయ‌ల‌లో రీఎంట్రీ ఇచ్చి అంద‌రికి షాక్ ఇచ్చాడు.రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.కిర‌ణ్ కాంగ్రెస్‌లో చేర‌డం ఎవ‌రిని పెద్ద ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేదు.ఎందుకంటే ఆంధ్ర‌ప్రదేశ‌లో ప్ర‌స్తుతం ప్ర‌ధానంగా రెండు పార్టీలే ఉన్నాయి. వాటిలో మొద‌టిది చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలోని తెలుగుదేశం,రెండోది జ‌గ‌న్ నాయ‌క‌త్వంలోని వైఎస్ఆర్‌సీపీ,ఈ రెండు పార్టీలు ప్రధానంగా ఏపీలో కొన‌సాగుతున్నాయి..ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన కిర‌ణ్ కుమార్ రెడ్డి ఈ రెండు పార్టీల‌లో చేరితే ఎవ‌రో ఒక‌రి నాయ‌క‌త్వంలో పని చేయవ‌ల్సి వ‌స్తుంది కాబ‌ట్టి ఈ రెండు పార్టీల‌లో కిర‌ణ్ చేర‌లేద‌నే విష‌యం అంద‌రికి తెలిసిందే.

ఇక కిర‌ణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ద్వారా ఎవ‌రికి లాభం ఎవ‌రికి న‌ష్టం అనే ప్ర‌శ్న‌లు మొద‌లైయ్యాయి.ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ‌వైభవం తీసుకురావ‌డానికి ఆ పార్టీ నేత‌లు తెగ కృషి చేస్తున్నార‌ని పైకి చెబుతున్న‌ప్ప‌టికి లోన మాత్రం వేరే త‌తంగం న‌డుస్తుంద‌ని కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.ఏపీలో అధికార పార్టీ అయిన తెలుగుదేశంగాని,ఇటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీకి కాని 2019 ఎలెక్ష‌న్సే టార్గెట్‌గా ప‌నిచేస్తున్నాయి.కాని కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి వేరు.ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని విడ‌గొట్టార‌నే కోపంతో ఉన్నారు ఏపీ ప్ర‌జ‌లు.ఏపీ ప్ర‌జ‌లుకున్నా కోపానికి మ‌రో 20 సంవ‌త్స‌రాలు అయిన ఆ పార్టీ గెలిచే ప‌రిస్థితి లేదు.మ‌రి కిర‌ణ్ కుమార్ ఏం ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరార‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.కిరణ్ కుమార్ కాంగ్రెస్ చేర‌డం ద్వారా సీఎం కూర్చీపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న జ‌గ‌న్‌కు తీవ్ర న‌ష్టం అని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.ఏవిధాంగా అనుకుంటున్నారా? ఏంలేదండీ తెలుగుదేశం,వైసీపీ టార్గెట్ 2019 అయితే,కాంగ్రెస్ పార్టీ టార్గెట్ 2024.2019 జ‌రిగే ఎలెక్ష‌న్స్‌లో వైసీపీ పార్టీని అధికారంలోకి రాకుండా చేయ‌డ‌మే కాంగ్రెస్ ల‌క్ష్యం.2019 జ‌రిగే ఎలెక్ష‌న్స్‌లో వైసీపీ ఓడిపోతే 2024 ఎలెక్ష‌న్స్ క‌ల్లా వైసీపీ క‌నుమ‌రుగు అవ్వ‌డం ఖాయం అని కాంగ్రెస్ భావిస్తుంది.2019 ఎలెక్ష‌న్స్‌లో టీడీపీ అధికారంలోకి వ‌స్తే తాము కూడా బ‌ల‌ప‌డ‌వ‌చ్చ‌ని కాంగ్రెస్ ఆలోచ‌న‌.2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే తాము బ‌ల‌ప‌డ‌టానికి మ‌రో 20 సంవ‌త్సరాలైన ప‌డుతుందని కాంగ్రెస్ నాయ‌కులు భ‌య‌ప‌డుతున్నారు.ఈ వ్యూహాంలో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరార‌నే తెలుస్తుంది.2019 ఎలెక్ష‌న్స్‌లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి ర‌హ‌స్య మ‌ద్ద‌తు తెల‌పాల‌నే ఆలోచ‌న‌లో ఉంద‌ని స‌మాచారం.2019 ఎన్నిక‌ల‌లో టీడీపీ అధికారంలోకి వ‌స్తే వైసీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంటుంద‌ని,పార్టీని కొన‌సాగించ‌డం క‌ష్ట‌మ‌వుతుంది, దీంతోనాయ‌కులు ఎవ‌రి దారి వారు చూసుకుంటారని అప్పుడు వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవ‌డం ద్వారా లాభా ప‌డ‌వ‌చ్చ‌ని కాంగ్రెస్ ఆలోచ‌న‌.ఇక వ‌ర‌స‌గా రెండు ప‌ర్యాయాలు అధికారంలో ఉన్న టీడీపీపై ప్ర‌జ‌లు తీవ్ర వ్య‌తిరేక‌త‌తో ఉంటారు కాబ‌ట్టి ,అప్పుడు ప్ర‌త్యాయ‌మ్నంగా కాంగ్రెస్ పార్టీ ఒక్క‌టే క‌నిపిస్తుందని ఆ పార్టీ హైక‌మాండ్ భావిస్తుంది.దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ వ‌దిలి వెళ్లిన నాయ‌కుల‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

అంద‌రు క‌లిసి ముక్కుమ్మ‌డిగా జ‌గ‌న్ సీఎం కాకుండా చూడాల‌ని ప్ర‌యత్నాలు చేస్తున్నారు.అదేంటీ వైఎస్.రాజ‌శేఖ‌ర‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడే క‌దా!సీఎంగా రెండు సార్లు చేసిన ఘ‌న‌త కూడా ఆయనికే ఉంది.పైగా 2009లో జరిగిన ఎలెక్ష‌న్స్‌లో కేంద్ర ప్ర‌భుత్వంలో కాంగ్రెస్ పార్టీ రావ‌డానికి రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఎంతో కృషి చేశారు. రాష్ట్రం నుండి ఎక్కువ ఎంపీ సీట్లు కూడా ఇచ్చాడు రాజ‌శేఖ‌ర‌రెడ్డి. మ‌రి అలాంటి నేత కొడుకు సీఎం అయితే త‌మ‌కే మ‌ద్ద‌తు ఇస్తాడు కాదా అనే అనుమానాలు అంద‌రిలో ఉన్నాయి.అయితే జ‌గ‌న్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి అయిన సోనియా గాంధీని ఎదురించి పార్టీ నుండి బ‌య‌టికి వ‌చ్చి, వేరే పార్టీ పెట్టిన సంగ‌తి తెలిసిందే.దీంతో సోనియా గాంధీ ఆయ‌న‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.దీంతో 2019 ఎలెక్ష‌న్స్‌లో జ‌గ‌న్ అధికారంలోకి రాకుండా చూడాలి అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది.2011లో కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వంపై జ‌గ‌న్ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నేత అయిన చంద్ర‌బాబు మ‌ద్ద‌తు తెల‌ప‌గాపొగా కిర‌ణ్ ప్ర‌భుత్వానికి అండగా నిల‌బ‌డిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.దీంతో 2019లో జ‌రిగే ఎన్నిక‌ల‌లో చంద్ర‌బాబుకి అండ‌గా నిలవాల‌ని కాంగ్రెస్ భావిస్తుంది.కాంగ్రెస్ పార్టీ 2024 ఎలెక్ష‌న్స్ టార్గెట్‌గా ఇప్ప‌టి నుండి వ్యూహాలు ర‌చిస్తుంది.ఇవ‌న్ని చంద్ర‌బాబు వ్యూహాల‌లో భాగ‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.అందుకే కిర‌ణ్ కుమార్ రెడ్డి త‌మ్ముడిని టీడీపీ పార్టీలోకి చేర్చుకున్నార‌ని, 2019 ఎలెక్ష‌న్స్‌లో కాంగ్రెస్ పార్టీ వాళ్లు టీడీపీకి ఓట్లు వేయ‌ల‌ని ప్ర‌చారం చేస్తార‌ని స‌మాచారం.అవ‌స‌రం అయితే డ‌బ్బు పంపిణీ కూడా కాంగ్రెస్ పార్టీయే చేస్తుంద‌ని..దీనిపై ఇప్ప‌టికే చంద్ర‌బాబుకి ఆ పార్టీ నాయ‌కులు హామీ కూడా ఇచ్చారని తెలుస్తుంది.మ‌రి ఇంత‌మంది రాజ‌కీయ చాణక్యుల మ‌ధ్య జ‌గ‌న్ ఎలా గెలుస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -