Sunday, April 28, 2024
- Advertisement -

కిర‌ణ్ కుమార్ రెడ్డి మ‌ళ్లీ కాంగ్రెస్‌లో చేరుతున్నారా..?

- Advertisement -

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చివ‌రి ముఖ్య‌మంత్రిగా పని చేసిన ఘ‌న‌త కిరణ్ కుమార్ రెడ్డికే ద‌క్కుతుంది. 2014 ఎలెక్ష‌న్స్‌కు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టాడు కిరణ్ కుమార్ రెడ్డి. 2014 ఎలెక్ష‌న్స్ త‌రువాత పెద్ద‌గా బ‌య‌ట ఎక్క‌డ క‌నిపించ‌ని కిరణ్ కుమార్ రెడ్డి మ‌ళ్లీ పాలిటిక్స్‌లో బిజి కావాల‌ని అనుకుంటున్నార‌ని స‌మాచారం. కిర‌ణ్ కుమార్ రెడ్డి త‌మ్ముడు టీడీపీ పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఇక కిర‌ణ్ కుమార్ రెడ్డి కూడా టీడీపీ చేర‌తార‌నే వార్త‌లు వినిపించిన, ఆయ‌న టీడీపీపై ఆస‌క్తిగా లేర‌ని స‌మాచారం.

వైసీపీలో చేరితే జ‌గ‌న్ ముందు త‌ను ఎక్క‌డ త‌క్కువ అవుతానో అనే భావ‌న‌తో కిర‌ణ్ కుమార్ రెడ్డి ఉన్నాడ‌ని తెలుస్తుంది. ఇక మిగిలింది కాంగ్రెస్‌…. తాను కాంగ్రెస్‌లో ,చేరితే అక్క‌డ త‌న‌కు త‌గినంత గౌర‌వం ఉంటుంద‌ని ,అక్క‌డ అంద‌రు త‌న‌కు ప‌రిచియం ఉన్నవాళ్లే కాబట్టి పెద్ద‌గా ఇబ్బంది ఉండ‌ద‌ని కిర‌ణ్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. దీనిలో భాగంగానే పళ్లంరాజు హైద్రాబాద్‌లో కిరణ్‌కుమార్ రెడ్డితో మంగళవారం నాడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరాలని ఆహ్వానించారు. మ‌రి దీనిపై కిర‌ణ్ కుమార్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -