Friday, May 10, 2024
- Advertisement -

వైఎస్ అయినా, కేసీఆర్ అయినా .. మా ముందు తలవంచాల్సిందే..

- Advertisement -

ఎంఐఎం ముఖ్యనేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము తలుచుకుంటే ఎవరినైనా సీఎం పీఠంపై కూర్చోబెడతామని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారాయి. ముఖ్యమంత్రులైనా సరే… మా ముందు తలవంచాల్సిందే అని కామెంట్ చేశారు.

వైఎస్ అయినా, కేసీఆర్ అయినా మాకు గొడుగు పట్టాల్సిందేనని అన్నారు. ఓ వైపు ఎంఐఎం పార్టీ తమ మిత్రపక్షమని టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీ అసదుద్దీన్ సోదరుడైన అక్బరుద్దీన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం పీఠంపై ఎవరు కూర్చోవాలో నిర్ణయించేదని మజ్లిస్ పార్టీయేనని వెల్లడించారు. హైదరాబాద్ లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

డిసెంబర్ 11 తర్వాత మజ్లిస్ బలమేంటో ప్రపంచం చూస్తుందని అక్బరుద్దీన్ అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరైనా తమముందు తలవంచాల్సిందేనని అక్బర్ పునరుద్ఘాటించారు. తాను కింగ్ కాదనీ, కింగ్ మేకర్ ననీ చెప్పారు. రీసెంట్‌గా జరిగిన ఓ బహిరంగ సభలో మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్‌పై ప్రశంసలు కురిపించారు. దీంతో ఎంఐఎం, టీఆర్ఎస్ మధ్య అధికారికంగా పొత్తు ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం టీఆర్ఎస్‌కు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -