వర్క్ టూ హోం అంటున్న ఎమ్మెల్యే రోజా…

- Advertisement -

ఏపిలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు ఎంతగా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 21,954 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చికిత్సకు 10, 141 మంది కోలుకున్నారు. 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ్టి వరకు మొత్తం 8,446 మంది మరణించారు. 24 గంటల్లో 1.10 లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కాటుకు ఈ మద్య రాజకీయ నేతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.. కొంత మంది చనిపోయారు.

ఇటీవల నగరి ఎమ్మెల్యే, నటి రోజా చెన్నైలోని ఓ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ మద్యనే డిశ్చార్జ్ అయిన విష‌యం తెలిసిందే. నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించ‌డంతో ఆమె ఇంటి నుంచే ప‌నిచేస్తున్నారు.

- Advertisement -

పని విషయంలో నిర్లక్ష్యం చేయడం ఇష్టం లేక.. కొంద‌రు అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో తాను వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో మాట్లాడాన‌ని తెలుపుతూ రోజా ఓ వీడియోను పోస్ట్ చేశారు. అంతే కాదు ఆమె క‌రోనా ఫ్రంట్ లైన్ వారియ‌ర్ల‌తో వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో మాట్లాడి క‌రోనా క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, ప్ర‌జ‌ల‌కు అందించాల్సిన సాయంపై సూచ‌న‌లు చేశారు.

ఈ టాలీవుడ్ హీరోలు అందరూ అలా కష్టపడే పైకి వచ్చారు!

చిట్టి చిట్టి దోశలతో అర్హ ప్రత్యేక్షం.. బన్నీ ఎమోషనల్!

13ఏళ్ళ చిన్నవాడితో ప్రేమలో పడిన షకీలా.. పెళ్లి చేసుకోదట?

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -
- Advertisement -