Tuesday, April 30, 2024
- Advertisement -

బీజేపీ తెగించిందా.. ఏంటి ఈ కబ్జా రాజకీయాలు !

- Advertisement -

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఇటీవల కాలంలో తీవ్ర ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశమంత కూడా కాషాయ జెండా ఎగరాలని బీజేపీ వెస్తోన్న ఎత్తుగడలు, అమలు పరుస్తున్న వ్యూహాలు.. దేశ రాజకీయాల్లో ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. వీలైనంత వరకు ఎన్నికల్లో గెలవడం.. లేదంటే దొడ్డి దారిలో అధికారాన్ని చేజిక్కించుకోవడం బీజేపీ ప్రధాన ఎజెండా అంటూ అన్నీ పార్టీలు మోడీ అమిత్ షా ద్వయంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ మద్య కాలంలో బీజేపేతర పార్టీ నేతలపై ఈడీ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. మోడి అమిత్ షా ద్వయన్ని విమర్శించిన ప్రతి ఒక్కరూ ఈడీ పంజరంలో చిక్కుకుంటున్నారు.

ఇక అధికారం కోసం ప్రభుత్వాలను కూల్చి అక్కడ బీజేపీ పాగా వేయడం కూడా పరిపాటిగా మారింది. ఉదాహరణకు మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాఖ్రే, ఏక్ నాథ్ షిండే ల రాజకీయం చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర మాదిరిగానే ఇంకా చాలా రాష్ట్రాలలో ఏక్ నాథ్ షిండే లు పుట్టుకొస్తారని కమలనాథులు బహిరంగ హెచ్చరికలు చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఇటీవల తెలంగాణలో టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కూడా దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే.

ఇక తాజా అరవింద్ కేజ్రీవాల్ కూడా బీజేపీ తనకు చేసిన ఆఫర్ గురించి చెప్పుకొచ్చారు. గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకుంటే మనిష్ సిసోడియాతో పాటు సత్యేంద్ర జైన్ లను ఈడీ కేసులనుంచి తప్పిస్తామని బీజేపీ ఆఫర్ చేసినట్లు కేజృవాల్ చెప్పుకొచ్చారు. అయితే ఏవైనా రాజకీయ పార్టీలు ఆధిపత్యం కోసం సరైన పద్దతిలో వ్యూహాలు రచిచడం.. వంటిని అమలు పరచడం మామూలే. కానీ బీజేపీ మాత్రం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలను కుల్చేందుకు ప్రయత్నిస్తూ వాటిని కూడా పబ్లిసిటీ చేసుకోవడం అంతు చిక్కని విషయమే. అయితే బీజేపీ చుట్టూ అలుముకుంటున్న ఈ కబ్జా రాజకీయం వచ్చే ఎన్నికల్లో మోడీ మేనియా పై వ్యతిరేక ప్రభావం చూపుతుందా ? లేదా మోడీకి అనుకూలంగా మారుతుందా ? అనేది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -