Sunday, April 28, 2024
- Advertisement -

జూమ్ మీటింగ్ : ర్యాగింగా.. రాజకీయమా ..?

- Advertisement -

ఇటీవల ఏపీలో విడుదల అయిన పదవ తరగతి పరీక్షల ఫలితాలపై అన్నీ వైపులా నుండి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విద్యార్థుల నుండి, విధ్యార్థుల తల్లిదండ్రుల నుండి ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వారు ఆ స్థాయిలో ప్రభుత్వ వైకరి పై విరుచుకుపడడానికి కారణం కూడా లేకపోలేదు. గత ఏడాది కరోన కారణంగా ప్రతి విద్యార్థిని పాస్ చేసి, ఈ ఏడాది మాత్రం ఒక్క మార్కు, అరమార్కుతో ఫెయిల్ చెయ్యడం ఏంటని విద్యార్థులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. దాంతో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడడం లేదు.

ఇందులో కూడా రాజకీయ పెంట చేస్తున్నాయి ఏపీ లోని ప్రధాన రాజకీయ పార్టీలు. ఇటీవల తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఫెయిల్ అయిన విద్యార్థులతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే పెద్ద ఎత్తున విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ఆరోపోంచారు. అయితే ఈ జూమ్ మీటింగ్ లోకి ఊహించని విధంగా మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంటి వైసీపీ నాయకులు వచ్చేశారు. ఒక మాటలో చెప్పాలంటే చొరబడ్డారనే చెప్పవచ్చు.

విద్యార్థుల లాగిన్ ఐడి తో వీరిద్దరు జూమ్ మీటింగ్ లోకి రావడం తో ఒక్క సరిగా సీన్ మారిపోయింది. అక్కడ చర్చించాలలసిన అంశాన్ని గాలికొదిలేసి అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ర్యాగింగ్ చేసుకోవడానేకే సరిపోయింది. దీంతో రెండు పార్టీల నేతల వైకరి గమనించిన ప్రజలు ” ఇదేం రాజకీయం రా బాబు ” అంటూ విమర్శిస్తున్నారు. విధ్యార్థుల జీవితాలకు సంబందించిన ఈ సీరియస్ ఇష్యూ ను సిల్లిగా మార్చి రాజకీయ పబ్బం గదుపుకుంటున్నాయి ఇరు పార్టీలు.

Also Read

అసలైన పొలిటీషియన్ .. బూతులే వీరి క్వాలిఫికేషన్ !

టార్గెట్ 2023 : ఈ ఎన్నికల్లో చెంపెట్టు ఎవరికి ..?

ఉక్రెయిన్ అమెరికా ను నమ్మడం లేదా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -