Tuesday, May 7, 2024
- Advertisement -

అనంత‌పురం టీడీపీఎమ్మెల్యేపై తిరుగాబావుట ఎగ‌రేసిన సొంత పార్టీ నేత‌లు

- Advertisement -

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డే కొద్దీ టీడీపీకి క‌ష్టాలు చుట్టుముడుతున్నాయి. ప్ర‌త్యేక‌హోదా, విభ‌జ‌న‌హామీలను సాధించ‌డంలో విఫ‌లంఅయిన టీడీపీ ప్ర‌జ‌లు ముందు దోషిగా నిల‌బ‌డింది. ఇది చాల‌న్న‌ట్లు పార్టీలో అంత‌ర్గ‌త పోరు బాబ‌కు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఎక్కువ‌గా ఫిరాయించిన నేత‌ల నియోజ‌క వ‌ర్గాల్లో నాయ‌కుల‌మ‌ధ్య విబేధాలు బ‌గ్గుమంటున్నాయి.

తాజాగా అనంత‌పురం టీడీపీలో ముస‌లం పుట్టింది. ప్ర‌స్తుతం టీడీపీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రికి సొంత‌పార్టీనేత‌ల‌కు షాక్ ఇస్తున్నారు. చౌద‌రికి వ్య‌తిరేకంగా మాజీ ఎంపి సైపుల్లా ఆధ్వర్యంలో పలువురు నేతలు అత్యవసర సమావేశం జరిపారు. ఎంఎల్ఏ నిరకుంశవైఖరికి నిరసనగా వీరంతా హాజరైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంఎల్ఏ తన పద్దతి మార్చుకోకపోతే తామంతా తమ దారి తాము చూసుకుంటామంటూ అల్టిమేటమ్ జారీ చేశారు.

నియోజ‌క వ‌ర్గంలో ఎమ్మెల్యేకి వ్య‌తిరేక ప‌వ‌నాలు బ‌లంగా వీస్తున్నాయి. దీనికి తోడు వైసీపీ నేత గుర్నాధరెడ్డిని టిడిపిలోకి చేర్చుకున్నప్పటి నుండి ప్రభాకర్ చౌధరి ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చౌదరికి టిక్కెట్టు దక్కే విషయంలో కూడా అనుమానమే. ఎందుకంటే, ఎంపి జెసి దివాకర్ రెడ్డి పట్టుబట్టి మరీ గుర్నాధరెడ్డిని టిడిపిలోకి లాక్కువచ్చారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇప్పించే హామీతోనే రెడ్డిని జెసి టిడిపిలోకి తీసుకొచ్చారు.

అప్పటి నుండి చౌదరి పార్టీలో సమస్యలు మొదలయ్యాయి. దానికితోడు తాజాగా పార్టీ నేతలు కూడా చౌదరిపై తిరుగుబాటు లేవదీయటంతో పార్టీలోని సమస్యలు రోడ్డున పడ్డట్లైంది. మున్ముందు ఎలాంటి ప‌రిస్థితులు ఎలా ఉంట‌యో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -