Tuesday, April 30, 2024
- Advertisement -

శ్రీనిరాజు లీగ‌ల్ నోటీసుకు ఘాటు స‌మాధానం ఇచ్చిన‌ జ‌న‌సేనుడు..

- Advertisement -

తన తల్లిని శ్రీరెడ్డి దూషించడం, కొన్ని మీడియా ఛానెళ్లు పదే పదే ఆ దృశ్యాలను ప్రసారం చేయడంతో జనసేనాని నొచ్చుకున్నారు. ఉద్దేశపూర్వకంగా తన తల్లిని తిట్టించారనే భావనలో ఉన్న ఆయన ఏబీఎన్, టీవీ9, టీవీ5 ఛానెళ్ల అధిపతులు లక్ష్యంగా పెట్టిన ట్వీట్లు రాష్ట్ర‌వ్యాప్తంగా ఎంత సంల‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలో శ్రీని రాజు పంపిన లీగల్ నోటీసులకు జనసేన అధినేత లేఖ ద్వారా ఘాటుగా బదులిచ్చారు. ట్విట్టర్ ఖాతాలో నేను ట్వీట్లు నా అభిప్రాయాలు. అవి నా భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినవని ఆయన శ్రీని రాజు లాయర్‌కు సమాధానం ఇచ్చారు.

నేను చేసిన ట్వీట్‌ ఏ రకంగానూ మీ క్లయింట్‌కు వ్యతిరేకంగా లేదు. ఆయనెందుకు స్పందించారో అర్థం కావడం లేదు. మీ ద్వారా ఆయన స్పందించడం ఆశ్చర్యం కలిగించిందని పవన్ తెలిపారు.

మీ క్లయింట్‌కు వ్యతిరేకంగా ఎలాంటి పరోక్ష ఆరోపణలు చేయలేదు. మనసు లోతుల్లోని అపరాధ భావంతో ఆయన తనకేదో ఊహించుకుంటున్నారు. టీవీ9, శ్రీసిటీ అనేవి మీ క్లయింట్‌కు చెందినవే విషయం సమాజానికి తెలిసినవే.

2018 ఏప్రిల్ 20న చేసిన ట్వీట్ లో… మీరు చెప్పినట్టు పరోక్ష నిందలు, లేదా ఆరోపణలు, లేదా నిరాధార వ్యాఖ్యలు లేవు. నా ట్విట్టర్ అకౌంట్ ద్వారా నా ఫీలింగ్స్ ను చెప్పాను. మీరు నోటీసులో చెప్పినట్టు… చట్ట ప్రకారం ఇది ఎవరిపైనా దాడి చేసినట్టు కాదు.

నాకు ఎన్ని ఆటంకాలు కలిగించినా… నా లక్ష్యం నుంచి నేను పక్కదోవ పట్టను. సమాజంలోని అన్ని వర్గాలు ఎదగడానికి కృషి చేస్తా. నేను పైన చెప్పిన వివరాలను దృష్టిలో ఉంచుకుని… మీ క్లయింట్ కు సరైన సలహాలు ఇస్తారని భావిస్తున్నా’ అంటూ పవన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన లేఖలో పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -