Saturday, April 27, 2024
- Advertisement -

కే‌సి‌ఆర్ ఫైర్.. వెనుక అసలు కారణలెంటి .?

- Advertisement -

ప్రత్యర్థి పార్టీలను ఇరకాటంలో పెట్టడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ది కాస్త భిన్నమైన శైలి. తన మాటల విధానంతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడడంతో పాటు ప్రజలను కూడా ఆకర్షిస్తారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని భావిస్తోన్న కే‌సి‌ఆర్ కు జాతీయ పార్టీ అయిన బీజేపీ ని విమర్శించేందుకు సరైన సమయం రాలేదనే. కానీ ఇటీవల హైదరబాద్ లో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణ ప్రజలపై కొంత మేర ప్రభావం చూపడంతో.. కే‌సి‌ఆర్ తన ఆలోచనలకు పదును పెట్టి తాజాగా బీజేపీ జాతీయ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.

దేశాన్ని బీజేపీ పట్టి పిడిస్తోందని, బీజేపీ నేతల వద్ద సరుకు లేదు, సబ్జెట్ లేదు అసలు ఏమి లేదని ఎద్దేవా చేశారు. దేశానికి కరెంట్ ఇవ్వడం కూడా మీకు చేతకాదు, కనీసం మంచి నీళ్ళు ఇచ్చే తెలివి తేటలు కూడా బీజేపీ నేతలకు లేవంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం వల్ల దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని, ఏడాదికి లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని కే‌సి‌ఆర్ విమర్శించారు. అంతే కాకుండా హైదరబాద్ లోనే మీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఎందుకు నిర్వహించారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం తెలివి తక్కువతనంతో దేశాన్ని నాశనం చేస్తోందన్నారు. దేశంలో ఇంత అసమర్థమైన పాలన నేనెప్పుడు చూడలేదని కే‌సి‌ఆర్ ఎద్దేవా చేశారు.

ఇలా బీజేపీ నేతలపై విరుచుకుపడుతూనే జాతీయ రాజకీయాలపై కూడా స్పష్టత ఇచ్చారు. ఇన్ని రోజులు కే‌సి‌ఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారు అనే వార్తలు వచ్చినప్పటికి.. పార్టీ కి బదులు గా భవసారూప్యత ఉన్న పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఫ్రంట్ తోనే మోడి ని దించుతామన్నారు కే‌సి‌ఆర్. అవసరమైతే జాతీయ పార్టీ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కే‌సి‌ఆర్ ఈ స్థాయిలో బీజేపీ జాతీయ నేతలపై ఫైర్ అవుతున్న విధానం చూస్తుంటే.. కే‌సి‌ఆర్ తన ఫోకస్ అంతా కూడా రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాలపైనే అని చెప్పకనే చెప్పినట్లు ఉందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read

జగన్నాటకం.. అంతా నాఇష్టం !

ఈటెల కు ప్రాధాన్యం ఇవ్వని బీజేపీ ?

రెండవసారి.. నో చెప్పిన వెంకయ్య ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -