Tuesday, May 7, 2024
- Advertisement -

ఈటెల కు ప్రాధాన్యం ఇవ్వని బీజేపీ ?

- Advertisement -

తెలంగాణలో రోజురోజుకూ బీజేపీ హవా పెరుగోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇటీవల హైదరబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రజల్లో లభించిన ఆదరణ చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమౌతోంది. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు నుంచి రాష్ట్రంలో బీజేపీ.. పరిధిని విస్తరించుకుంటూ వస్తోంది. దుబ్బాక ఉపఎన్నిక తరువాత బీజేపీకు ఊపు తెచ్చిన మరో విషయం హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలుపు.. అయితే ఈ గెలుపులో క్రెడిట్ అంతా కూడా ఈటెల రాజేందర్ కే చెందుతుంది. ఎందుకంటే టి‌ఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత.. ఈటెల హుజూరాబాద్ ఉప ఎన్నికలను కీలకంగా తీసుకొని కే‌సి‌ఆర్ కు షాక్ ఇస్తూ విజయ ధూందూది మోగించారు.

హుజూరాబాద్ గెలుపు తరువాత తెలంగాణలో బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన ఈటెల రాజేందర్ కు పార్టీలో కీలక బాధ్యతలు వస్తాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఒకానొక దశలో కే‌సి‌ఆర్ ను ఢీ కొట్టేందుకు సి‌ఎం అభ్యర్థిగా ఈటెల రాజేందర్ ను బీజేపీ బరిలో దించే అవకాశం ఉందనే వార్తలు కూడా బలంగానే వినిపించాయి. కానీ ఆ దిశగా బీజేపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇక ఆ తరువాత మెల్లమెల్లగా పార్టీలో ఈటెల కు ప్రాధాన్యం తగ్గిస్తూ వస్తున్నట్లు తాజా పరిణామాలను చూస్తే అర్థమౌతుంది. ఇటీవల ఈటెల రాజేందర్ కు బీజేపీ హైకమాండ్ చేరికల కమిటీ కన్వీనర్ గా కొత్త బాద్యతలు అప్పగించింది.

అయితే ఈ పదవి పట్ల ఈటెల అసంతృప్తి గా ఉన్నారట. ఎందుకంటే ఈటెల ఆశించిన పదవి అదికాదనే చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే కే‌సి‌ఆర్ పై నిప్పులు చెరుగుతున్న ఈటెల.. తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి కే‌సి‌ఆర్ ను అష్టదిగ్భంధం చేయాలని భావించారు. అందుకోసం బీజేపీ తరుపున స్టార్ క్యాంపయినర్ హోదా ఆశించినట్లుగా ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. కానీ బీజేపీ అధిస్థానం మాత్రం ఈటెల కు చేరికల కమిటీ కన్వీనర్ పదవి అప్పగించడంతో ఆయన నిరాశ కు లోనైనట్లు పోలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ..మరి రాబోయే రోజుల్లోనైనా ఈటెల కు బీజేపీ అధిష్టానం తగిన ప్రాధాన్యం ఇస్తుందో లేదో చూడాలి.

Also Read

కే‌సి‌ఆర్, పికే వ్యూహం.. ఫలించేనా ?

గులాబీ బాసుకు.. గుబులు ?

విడ్డూరం : మూడు పార్టీల్లో “జంపింగ్ జపాంగ్ ” ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -