Thursday, May 2, 2024
- Advertisement -

రెండవసారి.. నో చెప్పిన వెంకయ్య ?

- Advertisement -

దేశంలో ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్‌డి‌ఏ కూటమి తరుపున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపిక చేశారు కమలనాథులు. అయితే మొదట రాష్ట్రపతి అభ్యర్థి గా వెంకయ్య నాయుడు పేరు గట్టిగా వినిపించింది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా సామాజిక వర్గ మహిళా ద్రౌపది ముర్ము ను ఎంపిక చేసింది బిజెపి అధిష్టానం. ఒక సామాజిక మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంపై ఎన్‌డి‌ఏ కూటమి లోనూ, అటు విపక్షాలలోనూ అందరూ సంతృప్తిగానే ఉన్నప్పటికి.. వెంకయ్య మాత్రం కాస్త అసంతృప్తికి లోనయ్యారనే వాదనలు గట్టిగానే వినిపించాయి. ఎన్నో ఏళ్లుగా బీజేపీ లో వివాద రహితుడిగా కొనసాగుతున్న వెంకయ్య.. రాష్ట్రపతిగా అన్నీ విధాలుగా అర్హత ఉన్నప్పటికి రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎన్నుకోకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారని డిల్లీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ కారణం చేతనే ఉపరాష్ట్రపతి గా కొనసాగేందుకు వెంకయ్య నాయుడికి మరొకసారి అవకాశం ఇచ్చినప్పటికి ఆయన నిరాకరించారట. కానీ వెంకయ్య సన్నిహిత వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఉపరాష్ట్రపతి పదవి వల్ల పలు కార్యక్రమాలకు, వ్యక్తులకు దురమౌతుండడం.. ముఖ్యంగా ప్రోటోకాల్ ఇబ్బందులు ఎదురౌతుండడం వంటి కారణాల వల్ల రెండవ సారి ఉపరాష్ట్రపతిగా కొనసాగే అవకాశాన్ని వెంకయ్య నాయుడు సున్నితంగా తిరస్కరించాడట. అంతే కాకుండా ఆయన రాజకీయ జీవితనికి స్వస్తి పలికి, సామాజిక సేవ కార్యక్రమాలపై దృష్టి పెట్టె ఆలోచనలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం..రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎన్నుకోకపోవడంతోనే వెంకయ్య నాయుడు రెండవసారి ఉపరాష్ట్రపతిగా కొనసాగేందుకు నిరాకరించాడనే వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Also Read

గులాబీ బాసుకు.. గుబులు ?

బాబు, జగన్ లకు అగ్ని పరీక్ష.. మరి పవన్ సంగతేంటి ?

వెంకయ్యకు ఝలక్ ఇచ్చిన బీజేపీ ..కారణం ఆదేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -