Monday, April 29, 2024
- Advertisement -

టీడీపీ పై ఎద‌రుదాడె…..

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై చంద్ర‌బాబు కాన్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇత‌ర నాయ‌కులు ఆరోప‌న‌లు చేయ‌డం తెలిసిందె. ప్ర‌తీ విష‌యానికి జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేయ‌డం అల‌వాటుగా మారింది. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించిన ప్ర‌తీ సారి ఎదురుదాడి చేస్తున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను స‌క్సెస్ కాకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. అయితె ఇప్పుడు వాట‌న్నింటికి చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ కు బ‌ల‌మైన బ్ర‌హ్మాస్త్రం దొరికింది.

నవంబర్ 2వ తేదీ నుంచి జగన్ ఏపీలో పాదయాత్ర చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలు, ప్రత్యేక హోదా అంశాలతో పాటు తాను చేయబోయే వాటిని ఆయన ప్రజల్లోకి తీసుకు వెళ్లనున్నారు. అయితే ఏపీ టీడీపీ మంత్రుల‌పైన రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. దీంతో టీడీపీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది.

కొద్దిరోజుల‌క్రితం జ‌గ‌న్‌ను టార్గెట్ చేసిన టీడీపీ కృష్ణా నీటి విషయమై ఏపీ టిడిపి నేతలు.. జగన్‌కు చెందిన సాక్షి పత్రికపై మండిపడ్డారు. సాక్షి పత్రిక ఏపీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తోందని, జగన్ పక్క రాష్ట్రంలో ఉంటూ ఏపీపై విషం కక్కుతున్నాడని ఏపీ టిడిపి మండిపడింది.

కృష్ణా నీటి విషయంలో కల్పితాలు రాసి తెలంగాణను ఏపీ పైకి రెచ్చగొడుతున్నారని, తద్వారా జగన్, ఆయన మీడియా ఏపీకి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. అయితె పాద‌యాత్ర‌కు ముంద‌గా రేవంత్‌రెడ్డి రూపంలో ఆయుధం జ‌గ‌న్‌కు అందిచిన‌ట్లుగా ఉందంటున్నారు విశ్లేష‌కులు. సీఆర్ నుంచి ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీతలు కోట్ల రూపాయల కాంట్రాక్టులు తీసుకున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు జగన్‌కు ఆయుధాలుగా కానున్నాయి.

కేసీఆర్‌తో కలిసి డబ్బు దండుకుంటున్నారని తనను విమర్శిస్తున్న టిడిపి నేతలు కేసీఆర్‌తో జతకట్టి కాంట్రాక్టులు దక్కించుకొని డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించేందుకు జగన్‌కు అవకాశం వచ్చిందంటున్నారు. ఇక జ‌గ‌న్ టీడీపీ నేత‌ల మీద ఎదురు దాడి సురూ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -