Wednesday, May 8, 2024
- Advertisement -

జగన్ పై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే నిప్పులు

- Advertisement -

ప్రతి పక్షంలో ఉండే నాయకులు అధికార పార్టీ మీద నిప్పులు చెరగడం కామన్. కానీ తమ పార్టీ మీద కూడా విమర్శలు గుప్పిస్తే…! నిద్రపోతున్నారా ? కళ్లు తెరవండి. నిద్రమత్తు వీడి ప్రజల బాగోగులు పట్టించుకోండి. అని మండిపడితే అనేక అనుమానాలు వస్తాయి. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజన్నదొర వ్యవహారం కూడా ఇప్పుడు అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. కొద్ది రోజులుగా సాలూరు నియోజకవర్గంలోని ట్రైబల్ ఏరియాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. అంటువ్యాధులు ప్రభలుతున్నాయి. సరైన వైద్యం అందక పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయినా పరిస్థితుల్లో ఏ మార్పూ రాలేదు. అధికార యంత్రాగం, అధికార పార్టీ పట్టించుకోవట్లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి. దీంతో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని, అధికారులను తీవ్రంగా మందలించారు. ఏం చేస్తున్నారు మీరు ? గిరిజన ప్రాంతంలో మెరుగైన వైద్యం, అందించాలనే ఆలోచన లేకపోతే ఎలా ? మృతుల సంఖ్య ఇంకా పెరిగితే చూస్తూ ఊరుకునేది లేదని అధికారులతో పాటు ప్రభుత్వంలోని పెద్దలను, విజయనగరం జిల్లా టీడీపీ ఇంచార్జ్ మంత్రితో పాటు ఇతర నాయకులు, అధికారులను హెచ్చరించారు.

ఇదే సమయంలో తన నియోజకవర్గంలోని సమస్య తీవ్రతను గుర్తించి సాక్షాత్తూ సీఎం జోక్యం చేసుకున్నా ప్రతిపక్షం మాత్రం కనీసం పట్టించుకోలేదని సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజన్నదొర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతిపక్షం కంటే అధికార పక్షం ముందే మేల్కోవడం ఆహ్వానించతగ్గ విషయమే. కానీ మా పార్టీ రాష్ట్ర నాయకత్వం నిద్రపోతోంది. విషజ్వరాలతో జనం చనిపోతున్నా మా పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు కళ్లు తెరవడం లేదు. నిద్రమత్తు వీడి, ప్రజల్లోకి వెళ్తే మంచిది. అని మండిపడ్డారు. ప్రజలు మృత్యువాత పడుతున్నా ప్రతిపక్షం అటువైపు కన్నెత్తి చూడట్లేదు అంటే.. భవిష్యత్ లో పార్టీకి ఎంత నష్టమో అర్ధం చేసుకోవాలని ఆయన సన్నిహితుల వద్ద కూడా ఆక్రోషం వెళ్లగక్కారు. ఇప్పటికైనా ప్రతిపక్షం హోదాలో వైఎస్ఆర్ సీపీ, రాష్ట్ర జిల్లా స్థాయని నయకత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని లేదంటే 3 రోజుల్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అల్టిమేటం జారీ చేశారు.

రాజన్నదొర తీవ్ర వ్యాఖ్యలు, అల్టిమేటం ఓ రకంగా జగన్ ను ఉద్దేశించేననే గుసగుసలు వైఎస్ఆర్ సీపీ నుంచే వినిపిస్తున్నాయి. ఆయన ఆవేదనలో అర్ధముందని పార్టీ శ్రేణులు కొందరు సమర్ధిస్తున్నారు. అయితే నిజంగా ప్రజల తరఫున ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించలేకపోతోందనే ఆవేదనతోనే మాట్లాడారా ? లేక పార్టీ మారిపోయే ఆలోచన ఉందా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆయన టీడీపీ వైపు తొంగి చూశారు. ఏపీలో గిరిజన శాఖకు గిరిజనేతరుడు మంత్రిగా ఉన్నారు. నాకు ఏపీ గిరిజన శాఖ మంత్రిగా అవకాశమిస్తే టీడీపీలో చేరతాను అని రాజన్నదొర బేరసారాలు జరిపారు కూడా. కనీసం ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవైనా ఇప్పించగలరని చంద్రబాబు వద్దకు విన్నపాలు పంపినట్లు కూడా తెలిసింది. కానీ ఈయన విన్నపాలు ఆయన పట్టించుకోలేదు. మళ్లీ ఇప్పుడు రాజన్నదొర సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించడంతో మళ్లీ ఆయన టీడీపీ వైపు చూస్తున్నారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -