Friday, May 10, 2024
- Advertisement -

వంగవీటి రంగా పై వివాదాస్పద వ్యాఖ్యల వెనుక అస‌లు క‌థ‌..

- Advertisement -

వంగవీటి రంగా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన  గౌత‌మ్‌రెడ్డిని పార్టీ స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే హ‌టాత్తుగా రంగా గురించి అంత‌టి మాటల వెనుక ఏముంద‌నె చ‌ర్చ జోరుగా సాగుతోంది. రంగా విజయవాడకు చెందిన వ్యక్తే అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆయన పేరు తెలీని వారుండరు, రంగా చనిపోయి దశాబ్దాలవుతున్నా ఇప్పటికీ రంగా పేరు చెబితే కాపుల్లో ఉత్తేజం పొంగుతుంది. అంతటి ఘన చరిత్ర కలిగిన వ్యక్తి గురించి గౌతమ్ ఎందుకు అంత చవకబారుగా మాట్లాడారు?

వైసీపీ వర్గాలు కొన్ని ఆసక్తకరమైన విషయాలను చెబుతున్నారు. రంగా కొడుకు రాధాకృష్ణ, గౌతమ్ ఇద్దరూ వైసీపీ నేతలే. వీరిద్దరి మధ్య ఆధిపత్యపోరులో పార్టీ దెబ్బతిన్నమాట వాస్తవం. ఇటువంటి నేపధ్యంలోనే భారతీయ జనతా పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ను జగన్ పార్టీలోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా నగర అధ్యక్ష బాధ్యతలు వెల్లంపల్లికి అప్పగించారు. అప్పటి వరకు అధ్యక్షునిగా రాధా ఉండేవారు. ఎప్పుడైతే వెల్లంపల్లి బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుండి పార్టీలో చురుకుదనం వచ్చింది.

గౌతమ్ కు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై జగన్ నుండి స్పష్టమైన హామీ రాలేదట. ఇటు రాధాకు అటు వెల్లంపల్లికి హామీ ఇచ్చిన జగన్ తనకు మాత్రం ఎందుకివ్వలేదన్న విషయాన్ని గౌతమ్ జీర్ణించుకోలేకపోయారు. మ‌రో వైపు విజయవాడలో పార్టీని మరింత బలోపేతం చేయటంలో భాగంగా కాంగ్రెస్ నేత, రంగా శిష్యుల్లో ఒకరైన మాజీ ఎంఎల్ఏ మల్లాది విష్ణును కూడా జగన్ పార్టీలోకి చేర్చుకున్నారు.అసలే రాధా, వెల్లంపల్లితో పడని గౌతమ్ మల్లాదిరాక మరింత ఇబ్బందికరంగా తయారైందట.

టిక్కట్ల విషయంలో  ముగ్గ‌రికి జగన్ హామీ ఇచ్చారని కుడా ప్రచారం జరుగుతోంది. అంటే, టిక్కెట్టు హామీ లేనిది ఒక్క గౌతమ్ కే.  అందుకే ప్రత్యమ్నాయంగా భాజపాతో టచ్ లోకి వెళ్ళారని ప్రచారం మొదలైంది. భాజాపాలో టికెట్ క‌న్ఫ‌మ్ కావ‌డంతో వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారట. టివి ఛానల్ కుడా గౌతమ్ ను ఇంటర్వ్యూ చేసింది. దాన్ని అవకాశంగా తీసుకున్న గౌతమ్ వంగవీటి రంగా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. రంగాపై విమ‌ర్శ‌లు చెస్తె పార్టీ  తనపై చర్యలు తీసుకుంటుదని తెలీనంత అమాయకుడేమీ కాదు . భాజాపాలో చేర‌డానికేన‌ని అర్థ‌మ‌వుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -