Monday, April 29, 2024
- Advertisement -

శృంగవరపు కోటలో గెలుపు ఖాయం చేసి వైకాపాలోకి వస్తున్న రఘురాజు

- Advertisement -

నాయకులు పార్టీలు మారడం ఇప్పుడు పెద్ద విషయం కాదు. అయితే బిజెపి నాయకుడు రఘురాజు వైకాపాలో చేరడానికి రచించిన వ్యూహం మాత్రం ఇప్పుడు విజయనగరం జిల్లా, శృంగవరపు కోట నియోజకవర్గంలో వైకాపాకు ప్రత్యర్థులైన టిడిపి నాయకుల్లో ఆందోళన పెంచుతోంది. జగన్‌ని మెప్పించి పార్టీలో చేరడం కోసం రఘురాజు ఆ స్థాయిలో వ్యూహరచన చేశాడు మరి. గత కొన్నేళ్ళుగా ప్రజలకు చేరువయ్యేందుకు కష్టపడ్డాడు. ప్రజలను ఏ స్థాయిలో మెప్పించానో చూడమని చెప్పి జగన్‌కి చూపించేందుకు కాటసాని రాంభూపాల్ రెడ్డి చేత తన నియోజకవర్గంలో సర్వే చేయించాడు. ఆ సర్వేలో మెజారిటీ ఏ రేంజ్‌లో సాధించగలనో వైకాపా అధిష్టాన నాయకులకు అర్థమయ్యేలా చేశాడు రఘురాజు. అందుకే ఇప్పుడు పార్టీలో చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

వైస్సార్ హయాంలో ఇదే నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ముప్ఫై వేల పైచిలుకు ఓట్లు సాధించిన ఘనత రఘురాజుది. పైగా బొత్స సత్యనారాయణతో సాన్నిహిత్యం ఉంది. ప్రస్తుతం బిజెపిలో ఉన్న ఈ నాయకుడు చాలా కాలంగా వైకాపాలో చేరడం కోసం బొత్స ద్వారా జగన్‌ని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే జగన్‌ని కలవక ముందే తన సత్తా ఏంటో కూడా వైకాపా నాయకులకు చూపించాలనుకున్నాడు. అందుకే ఇండిపెండెంట్‌గా నిలబడినా కూడా తాను ఏ స్థాయిలో ఓట్లు సాధించగలనో కాటసాని రాంభూపాల్ రెడ్డి చేత ప్రత్యేక సర్వే చేయించాడు. దాదాపుగా 25వేల ఓట్లు ఖాయంగా రఘురాజుకు ఉన్నాయని ఆ సర్వేలో తేలింది.

శృంగవరపు కోట, వేపాడు మండలాల్లో రఘురాజుకి పూర్తి ఆధిక్యం ఉండడం ప్రత్యర్థులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్‌ని కలిశాడు రఘురాజు. పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా ఇదే స్థాయిలో కష్టపడితే 2019 ఎన్నికల్లో వైకాపాకు ఘనవిజయం ఖాయమని ఈ సందర్భంగా అక్కడే ఉన్న వైకాపా నాయకులు విశ్లేషించడం రఘురాజు వ్యూహం వైకాపా నాయకులను ఏ స్థాయిలో మెప్పించిందో చెప్పకనే చెప్తోంది. అయితే కేవలం నినాదాలకు పరిమితం అవ్వకుండా…….రఘురాజును అభినందించడంతో సరిపుచ్చకుండా ఇతర నాయకులు కూడా ఇదే స్థాయిలో కష్టపడతారా? ప్రజలు ఏ స్థాయిలో ఆయా నాయకుల పట్ల సానుకూల అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకుని……….ప్రజలను మెప్పించడం కోసం కష్టపడతారా? మిధున్‌రెడ్డిలాంటి నాయకులు, ఇంకా కొంతమందిని పక్కన పెడితే వైకాపాలో ఎక్కువ మంది నాయకులు కేవలం జగన్ కష్టంతో అధికారాన్ని అనుభవిద్దామన్న ఆశతో ఉన్నారని విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు రఘురాజును చూశాక అయినా అలాంటి నాయకుల్లో మార్పు వస్తుందేమో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -