Tuesday, April 30, 2024
- Advertisement -

తెలంగాణాలో ఓటు ప‌డ‌క‌ముందే చేతులెత్తేసిన టీడీపీ..

- Advertisement -

ఒకొప్పుడు తెలంగాణాలో టీడీపీకీ బ‌ల‌మైన పార్టీ క్యాడ‌ర్‌, బ‌ల‌మైన నాయ‌కులు ఉండేవారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ 15 స్థానాల్లో గెలిచి స‌రిపెట్టుకుంది. త‌ర్వాత గులాబీ ఆప‌రేష‌ణ్ ఆక‌ర్ష‌లో భాగంగా టీడీపీ సీనియ‌ర్ నేత‌లంతా గులాబీ గూటికి చేర‌డంతో పార్టీ అస్థావ ద‌శ‌లో ఉంది. తెలంగాణాలో టీడీపీ దుస్తితికి కార‌ణం చంద్ర‌బాబే. టీఆర్ ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తెలంగాణాపై బాబు ఫోక‌స్ పెట్ట‌క‌పోవ‌డంతో పార్టీకీ గ‌డ్డు ప‌రిస్థితులు దాప‌రించాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, చంద్ర‌బాబు ఆధారాల‌తో అడ్డంగా ఇరుక్కోవ‌డం బాబుకు చిక్కులు తెచ్చి పెట్టింది.

రాష్ట్రంలో పార్టీని కాపాడుకొనేందుకు కాంగ్రెస్ పార్టీతో జ‌త‌క‌ట్టి మ‌హాకూట‌మిగా ఏర్ప‌డి కేసీఆర్‌ను ఢీకొడ్తున్నారు. పొత్తులో భాగం టీడీపీకీ 14 సీట్లు కేటాయించింది కాంగ్రెస్‌. అవి కూడా 2014 ఎన్నిక‌ల్లో గెలిచిన సీట్ల‌లోనే మ‌రోసారి పోటీ చేయ‌నుంది. అయితే ఇచ్చిన సీట్ల‌లో పూర్తిగా కూడా అభ్య‌ర్థ‌ల‌ను నిల‌బెట్టుకోలేని ప‌రిస్థితి దాపురించింది టీడీపీకీ. ఒకొప్పుడు ఓ వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు ఉనికికోసం ప్రాకులాడుతోంది.

మహాకూటమిలో చేరిన తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ ప్రసాదించిన సీట్లు పద్నాలుగు. ఇవి కూడా గత ఎన్నికల్లో టీడీపీ నెగ్గిన సీట్ల కంటే తక్కువే. టీడీపీకి మరీ ఇన్ని తక్కువ సీట్లా అని కొంతమంది ఆ పార్టీ వీరాభిమానులు ఫీలయ్యారు.కనీసం ఆ అన్ని సీట్లలోనూ అభ్యర్థులను నిలుపుకోలేకపోయింది ఆ పార్టీ. తెలంగాణలో నామినేషన్స్ పర్వం ముగిసిన నేపథ్యంలో పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థులు ఎంతమంది అంటే.. 14 సీట్ల‌కు గాను పదమూడు మంది మాత్రమే నామినేష‌న్లు వేశారు. ఓటు ప‌డ‌క ముందే టీడీపీ చేతులెత్తేసింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నిన్న పుట్టిన పార్టీ టీజేఎస్ ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్ల‌లోనే నామినేష‌న్ వేస్తే …డీపీ మాత్రం తన కోటాలో వచ్చిన సీట్లకు కూడా నామినేషన్స్ వేయలేకపోయింది. ఎన్నిక‌లు మొద‌ల‌వ్వ‌కుండానే టీడీపీ చేతులెత్తేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -