Monday, May 6, 2024
- Advertisement -

కరోనా విషయంలో సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం!

- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ పదవిలోకి వచ్చిన తర్వాత అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి కోసం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కరోనాపై పోరులో భాగంగా ఏర్పాటు చేసిన సలహా కమిటీలో అన్నాడీఎంకే నేత, రాష్ట్ర మాజీ ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్ కు చోటు కల్పించారు. 13 మందితో కూడిన ఈ ప్యానెల్ లో ఆశ్చర్యకరంగా ఏకంగా 12 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు చోటిచ్చారు.

ఈ కమిటీలో అధికార పార్టీ నుంచి డాక్టర్ ఎళిలన్‌కు మాత్రమే చోటు లభించింది. నిజానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే కమిటీలు అధికార పార్టీ సభ్యులతో నిండిపోతుంటాయి. ఈ కమిటీకి ఛైర్మన్ గా స్టాలిన్ ఉంటారు. మే 13 న జరిగిన కోవిడ్ సంక్షోభం యొక్క అఖిలపక్ష సమావేశంలో ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా ఎంకే స్టాలిన్ ఈ బహుళ పార్టీ సలహా కమిటీని ఏర్పాటు చేశారు.

సాధారణంగా ఏ అధికార పార్టీ అయినా.. ప్రతిపక్ష నేతలకు తూతూమంత్రంగా అవకాశం ఇస్తారు. అయితే, స్టాలిన్ ఆ పద్ధతిని మార్చేశారు. విమర్శలకులు సైతం హర్షించేలా రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

పవన్ తో మూవీపై బండ్ల గణేష్ ఏమన్నారో తెలుసా?

పుట్టిన రోజు వేడుకలకు ఇది సమయం కాదు : ఎన్టీఆర్ బహిరంగ లేఖ

కొత్త డైరెక్టర్ తో వైష్ణవ తేజ్ సినిమా.. పాత్ర ఏంటంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -